మంచిమాట : చేసే పనిని ప్రేమించగలిగితే ఎలాంటి పనైనా సృజనాత్మక స్థాయిని చేరుకుంటుంది..!

Divya

ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..చేసే పనిని ప్రేమించగలిగితే  ఎలాంటి పనైనా సృజనాత్మక స్థాయిని చేరుకుంటుంది..!

దీని అర్థం ఏమిటంటే.. మనం చేసే ఏ పని అయినా సరే ఆ పనిని మనం ప్రేమించగలగాలి. అప్పుడే ఆ పని మీద శ్రద్ధ పెట్టడానికి వీలవుతుంది. శ్రద్ధ లేకుండా చేసే పని ఏదైనా  సరే ఎలాంటి విజయాన్ని సాధించలేదు. చేసే పని ఏదైనా సరే శ్రద్ధగా చేయాలి. అప్పుడే ఆ పని ఒక సృజనాత్మక స్థాయిని చేరుకుంటుంది. అని దీని అర్థం.

ఉదాహరణకు మీరు ఏదైనా ఒక పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు,  ఆ పనిని ముగిసే వరకు మధ్యలో ఆపకూడదు. ఒకవేళ ఈ రోజు లేదా రేపు లేదా ఎల్లుండి అని పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తే,  ఆ పని ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. అదే పట్టుదలతో, కృషి తో ఎంతటి కష్టం వచ్చినా సరే.. ఆ పని ముగిసేవరకు చేస్తేనే , ఆ పని యొక్క రూపాన్ని దాల్చుకుంటుంది. అందుకే పెద్దలు కూడా చెప్పారు.. చేసే పని మీద పట్టుదల,శ్రద్ధ ఉండాలి. అని.. ఒకవేళ ఆ శ్రద్ధ లేనప్పుడు ఎలాంటి పనినైనా సాధించలేరు.. ఏదైనా ఒక లోహం ఆభరణం గా  మారాలి అంటే తప్పకుండా ఆ లోహాన్ని కరిగించి తీరాలి. అప్పుడే ఆ లోపం సరైన ఆభరణంగా రూపుదిద్దుకుంటుంది.. కాబట్టి శ్రద్ధ పెట్టి చేసే  ప్రతి పని కచ్చితంగా సృజనాత్మక స్థాయికి చేరుకుంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: