మంచిమాట : మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం లభిస్తుంది..
మనం నివసిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము.. అయితే ఇవన్నీ మనకు తెలియాలి అంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం లభిస్తుంది..
దీని వివరణ ఏమిటంటే.. ప్రతి నిమిషం, ప్రతిక్షణం ఇతరుల పట్ల గాని, మన పట్ల గాని ఆలోచించే తీరు స్వచ్ఛంగా ఉండాలి. ఎదుటి వాళ్ళ పైన ఎలాంటి ద్వేషాన్ని పెంచుకోకూడదు. ప్రతి ఒక్కరూ మన వాళ్లే అని అనుకోవాలి. అలా ఎప్పుడైతే అనుకొని, పూర్తిగా మన ఆలోచనలను మంచి మార్గం వైపు నడిపిస్తామో, అప్పుడు ప్రతి క్షణం ఆనందాల హరివిల్లు గా మారుతుంది. కష్టం కూడా మన ఒంట్లో నిలవలేక పారిపోతుంది. ఆనందానికి పుట్టిల్లు ఏర్పడుతుంది. కాబట్టి మన ఆలోచన తీరు మారినప్పుడే మనం జీవితాంతం ఆనందంగా ఉండగలము..
ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యాపారం లో కానీ, ఒక రంగంలో కానీ, ఒక విద్యలో కానీ ఇలా ఏదో ఒక రంగంలో పై స్థాయిలో ఉన్నప్పుడు వారిని చూసి మీరు ఈర్ష చెందరాదు. వారు ఎంత కష్టపడి అంత ఉన్నత స్థాయికి చేరుకున్నారో ఆలోచించి, అభినందించి, వీలైతే తగిన సహాయం చేయాలి. లేదా వాళ్ల గురించి చెడుగా ఆలోచిస్తూ వాళ్ళ అంతం చూడాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటే ఇక మనకు కూడా జీవితాంతం సుఖం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మంచిగా ఆలోచించినప్పుడే మన ఆలోచనలు కూడా మంచిగా మారుతాయి. అప్పుడే జీవితాంతం సుఖంగా జీవించగలుగుతాము ...