మంచిమాట: ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు!

Durga Writes

నేటి మంచిమాట.. ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు! అంతేకదా! ఈరోజు నీ ఓటమిని అంగీకరిస్తే నువ్వు ఓ పాఠం నేర్చుకున్నట్టే.. అదే నువ్వు గర్వంతో.. ఓటమిని అంగీకరించకపోతే నీ జీవితంలో విజయం అనేదే ఉండదు.. ఇంకా ఓడిపోయాం అని కుంగి కృశించి పోతే.. మరోసారి కూడా ఓడిపోతాం అనే భయంతో ప్రయత్నం చెయ్యకపోతే జీవితంలో విజయం సాధించలేవు. 

 

ఇంకా అలా కాదు అని నువ్ ఓడిపోవడం అంగీకరించి.. మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తే ఎప్పటికైనా సరే విజయం నీ సొంతం అవుతుంది. దీనికి కావలసింది అంత నీ మంచి మనసే.. నువ్వు ఓడిపోవడం.. గెలవడం అన్ని నీ చేతుల్లో ఉన్నాయని తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. 

 

అలా కాదు అని.. ఎప్పుడు ఓటమి భయంతో ప్రయత్నం చెయ్యకపోతే నీ అంత మూర్కుడు మరొకడు ఉండడు. ఓటమి భయం ఉంటే ఎడిసిన్ బల్బ్ కనిపెట్టవాడు కాదు.. అసలు ఈరోజు మన జీవితాల్లో ఈ వెలుతురు ఉండదు.. అతను ఓటమిని ప్రేమించి.. మళ్లీ మళ్లీ ప్రత్నించడు కాబట్టే ప్రపంచం ఉన్నంత వరుకు అతని పేరు వినిపిస్తూనే ఉంటుంది. 

 

అందుకే ఓడిపోయినా సమయంలో మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చెయ్యాలి.. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది. లేదు అంటే మనకు ఎప్పుడు ఓటమే సొంతం అవుతుంది. అందుకే గెలుపుని ఆస్వాదించాలి.. ఓటమిని ప్రేమించాలి. అప్పుడే కదా మన గెలుపు మనకు సొంతం అవుతుంది. 

 

ఒక్కసారిగా ఎవరు గెలవారు.. గెలుపు కోసం నీ ప్రయత్నం నువ్వు చెయ్యి.. ఖచ్చితంగా విజయం సాధిస్తావు.. ఆలా కాదు అని ఎప్పుడు నిరాశే పడితే విజయం రాదు.. విజయానికి తగ్గ కష్టం ఉంటేనే విజయం సాదించగలవు.. కష్టపడు.. ప్రయత్నం చెయ్యి.. విజయం సాధించు.                

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: