మంచిమాట : నాయకత్వం అంటే నలుగురికి సమాధానం చెప్పగలగాలి..!!

Divya
పూర్వం ఒకసారి అడవి పక్షులన్నీ కలిసి తమకు రాజును ఏర్పాటు చేసుకోదలచాయి. అందుకోసం వెంటనే ఒక చోట సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా చేసుకోవాలా అని సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆ సమయంలో అనేక పక్షులు తాము రాజు గా ఉండేందుకు తగిన అర్హతలు కలిగి ఉన్నామని చెప్పాయి. ఓ నెమలి వారి దగ్గర నిలిచి తన సౌందర్యాన్ని వారికి చూపించింది. తన రంగుల పించాన్ని చూపి ఆకట్టింది. అలాగే అద్భుతంగా నృత్యం చేసి అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. నెమలి నాట్య కోశలానికి అన్ని పక్షులు ఎంతో సంతోషించాయి. ఎంతో మెచ్చుకున్నాయి.. అయితే ఇది అదునుగా తీసుకున్న నెమలి పక్షిరాజ్యానికి తనని రాజును చేయాలని కోరింది. ఆ వన్నెలు చూసి భ్రమించి విశేష సంఖ్యలోని పక్షులు పక్షి రాజ్యానికి నెమలినే రాజుని చేయాలనీ నిర్ణయించాయి.
అంతటి అందమైన రాజు తమకు లభించినందుకు పక్షులన్నీ పరమానందభరితమై రాజాభిషేక మహోత్సవానికి ప్రయత్నిస్తుండగా ఒక చిలుక ఇలా అంది. మీరంతా కలిసి అసమాన సౌందర్యం గల మాయురాన్ని రాజ్యాధిపతిగా చేయాలని నిర్ణయించుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అయినా నా మనసులో ఒక సందేహం బాధిస్తోంది. ఇప్పుడు ఈ నెమలిని రాజుగా చేసుకుని మన ధనప్రాణాలను ఇతని ఆధీనం చేస్తున్నాం. రాజువల్ల కలగవలసిన ముఖ్యఫలం ప్రజల రక్షణేగదా? ప్రజారక్షణ చేయలేని రాజు ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? రేపటి నుంచి డేగలు, రాబందులు మొదలైన క్రూరపక్షులు మనమీద దాడి చేసి మనల్ని తినేస్తుంటే తాను అడ్డుపడి మన ప్రాణాలు కాపాడ గలదేమో ఈ రాజునుఅడిగి అప్పుడు పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపిస్తే బాగుంటుందని నాసలహా అన్నది.
 
ఆ మాటలు విని పక్షులన్నీ తెల్లబోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాయి. నెమలి తగిన సమాధానం చెప్పలేక మౌనం వహించింది. అప్పుడు పక్షులన్నీ కలిసి తెలివి తెచ్చుకొని నెమలికి రాజ్యాధికారం ఇవ్వడానికి స్వస్తి పలికాయి. జంతువులు పెద్ద పక్షులు దాడి చేసినప్పుడు రాజుగా నెమలి దాటిగా ఎదుర్కొనలేదన్నా నిర్ధారణకు వచ్చి నెమలిని రాజుగా చేయాలన్నా ఆలోచనను విరమించుకున్నాయి.బాహ్య సౌందర్యానికి ఉప్పొంగి అధికారం కట్టబెట్టి ఇబ్బందులు పడేకంటే శక్తిముక్తులు పరిశీలించి న్యాయకత్వ లక్షణాలు ఉంటేనే ఎంపికచేసుకోవాలని అవి గ్రహించాయి. చిలుక అనుమానాన్ని సమర్థించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: