మంచిమాట: పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహమే ఎక్కువ బలాన్ని ఇస్తుంది..!

Divya
పల్లెటూర్లో ఉండే చంద్రయ్య పట్టణంలో ఉండే తన కొడుకు, మనవడు ఎలా ఉన్నాడో ఒక్కసారి చూసి రావాలి అనుకుని పట్నం బయలుదేరాడు. కొడుకు రాఘవయ్య , మనవడు చైతన్యలను చూసి చాలా సంతోషించాడు. తాను తెచ్చిన మిఠాయిలను వాళ్లకు ఇచ్చాడు. అయితే మనవడు ఎందుకో దిగులుగా ఉండటం చంద్రయ్య గమనించాడు కారణం ఏమిటో అర్థం కాలేదు.
   
ఓ రోజు చైతన్య బడినుండి రాగానే ఉత్సాహంగా నాన్న! ఈరోజు నాకు ఆట పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చూడు అంటూ తను గెలుచుకున్న కప్పు చూపించాడు. రాఘవయ్య మాత్రం అంతగా పట్టించుకోకుండా "సర్లే! బిల్లు నాకు బోలెడంత పని ఉంది. అంటూ వెళ్లిపోయాడు చంద్రయ్య ఈ విషయాన్ని దూరంగా కూర్చుని గమనించాడు.
రెండు రోజుల తరువాత చైతన్య వచ్చి నాన్న! నాన్న! ఇదిగో మార్కుల లిస్టు ఇచ్చారు. చూడు అన్ని ఫస్టు మార్కులు వచ్చాయి. అంటూ ఉత్సాహంగా చెప్పసాగాడు. రాఘవయ్య తన ధోరణిలో తానుండి ఊరికే నన్ను విసిగించకు నేను దుకాణం కోసం తెచ్చిన సరుకుల లెక్క చూసుకోవాలి"అంటూ కసురుకున్నాడు చైతన్య చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. మనవడి దిగులుకు కారణమేంటో చంద్రయ్యకు అర్థమయింది.
ఆ రోజు అందరూ భోజనాలు చేసి ఆరుబయట కూర్చున్నాక చంద్రయ్య కొడుకులను పిలిచి "చూడు రాఘవా! నేను వచ్చి నప్పటి నుంచి గమనిస్తున్నాను. పిల్లవాడి విషయంలో మీ ప్రవర్తన ఏమీ బాలేదు. పిల్లలు తప్పు చేసినప్పుడు దండించడం ఎంత అవసరమో మంచి పని చేసినప్పుడు మెచ్చుకొని ప్రోత్సహించడం కూడా అంతే అవసరం.. నేను నీ చిన్నప్పుడు నిన్ను ఇలాగే ప్రోత్సహించే వాడిని అందుకే నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద దుకాణాన్ని చక్కగా నిర్వహించగలుగుతున్నావు అన్నాడు.

దాంతో రాఘవయ్య కు తన తప్పు తెలిసివచ్చింది. అప్పటినుండి కొడుకును ఆట పాటలు చదువు విషయంలో మెచ్చుకొని ప్రోత్సహించడం ప్రారంభించాడు. మీరు కూడా ఒకవేళ తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయలేదు.. మీరిచ్చే ప్రోత్సాహమే వారికి ఎంతో ధైర్యాన్ని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: