మంచిమాట : జీవితంలో పైకి ఎదగాలి అంటే తప్పక గుర్తుంచుకోవలసిన అంశాలు..!!

Divya
పుట్టింది మొదలు గిట్టే వరకు.. ఒక మనిషి జీవించాలి అంటే ఎన్నో ఒడిదొడుకులను.. కష్టసుఖాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క సమయంలో కష్టం ఎదురవ్వచ్చు. ఇంకొక సమయంలో సుఖసంతోషాలు ఎదురవ్వచ్చు.. వానైనా.. ఎండైనా.. చలైనా.. గాలైనా.. తప్పకుండా అన్నింటికీ ఓర్చుకుంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాము. ఉదాహరణకు మనం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని అనుకుంటే.. మధ్యలో రాళ్లు.. ముళ్ళ కంపలు.. ఆకలి.. దప్పిక.. మనల్ని పరీక్ష పెడతాయి.. అటువంటి సమయంలో మనం నిరుత్సాహపడకుండా అన్నింటిని తోసుకుంటూ మనం పెట్టుకున్న లక్ష్యం వైపు ముందడుగు వేయడం వల్ల తప్పకుండా జీవితంలో పైకి ఎదుగుతాము.. వీటిని దాటి నప్పుడే ఎవరెస్టు శిఖరాన్ని అవలీలగా అధిరోహించగలగుతాము..

ఇకపోతే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని అనేది లక్ష్యం అయితే జీవితంలో కూడా ఉన్నత స్థానానికి చేరుకోవాలని అనే విషయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. అలా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే మాత్రం తప్పకుండా ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ లక్ష్యం వైపు అడుగులు వేయడం వల్ల త్వరగా మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతున్నాం. ఇక ఇతరులతో కూడా సంతోషంగా కలిసిపోతూ అవసరమయ్యే నాలుగు మాటలు చర్చించుకుంటూ ఉండడంవల్ల శత్రువులు కూడా ఆప్తులుగా మారుతారు. మనకు ఉన్న దానిలో కనీసం 25% కష్టాల్లో ఉన్నవారికి అందిస్తే వారి దృష్టిలో మీరే దేవుడు అవుతారు.
ఇక అంతే కాదు చిన్నచితకా.. పెద్ద.. ధనిక.. పేద.. కులం.. మతం.. వర్గం.. అన్ని బేధాలను మొదలుపెట్టి మనిషి గా జీవించడం నేర్చుకుంటే కష్టాలు నష్టాలు అనే ఎటువంటి ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇక ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమన్వయంతో జీవితాన్ని ముందడుగు వేయడం వల్ల తప్పకుండా ప్రతి విషయం మనకు అనుకూలంగా వ్యవహరించడం కాకుండా దేవుడు కూడా మనకు సహాయం చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి సత్ మార్గంలో జీవించడం మొదలు పెడితే జీవితంలో తప్పకుండా పైకి ఎదగగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: