మంచిమాట : మనం మన పనులను సక్రమంగా చేసినప్పుడే అందరి మెప్పు పొందవచ్చు..!

Divya
అనగనగా ఒక ఊరిలో ఒక కోతి ఉంది. దాని పేరు కుట్టి. అది పల్లకిలో ఊరేగుతున్న పెళ్లి కూతుర్ని చూసి అబ్బా ఎంత అందంగా ముస్తాబు అయ్యింది. ఇలా నేను ఎప్పటికైనా అలంకరించుకోవాలి. అనుకుంది కుట్టి.. అలా మనసులో అనుకుందో లేదో ఒకరోజు కుట్టి గాఢనిద్రలో ఉండగా అటువైపు నాటకాలు వేసే బృందం ఒకటి అక్కడకు వచ్చింది. వాళ్లు పక్క ఊరిలో నాటకాలు వేయటానికి వెళుతూ కాసేపు ఆ చెట్టు కింద నిద్రపోయారు. తరువాత వాళ్ళు చక్కగా అలంకరించుకున్నారు.

ఇదంతా చెట్టు మీద నుంచి మౌనంగా చూసింది కుట్టి. ఎన్నాళ్ల నుంచో తన మనసులో ఉన్న కోరికను తీర్చుకునే అవకాశం వచ్చిందని సంబరపడింది. వారి దగ్గరున్న అలంకరణ సామాగ్రి పెట్టను దొంగలించి దూరంగా తీసుకు పోయింది. అందంగా ముస్తాబై తన స్నేహితులకు చూపించి మెప్పు పొందాలనుకుంది. ఒకచోట కూర్చుని ఆ పెట్టెను తెరచి ముఖానికి పౌడర్ కళ్ళకు కాటుక పెదవులకు లిప్స్టిక్ పూసుకొని, నగలను వేసుకుంది. రంగురంగుల చంకీలా చున్నీని ఒంటికి చుట్టుకొని అద్దంలో చూసుకుని మురిసిపోయింది. అంతలో మిగిలిన స్నేహితులందరూ వచ్చారు.

విచిత్ర అలంకరణలో ఉన్న కుట్టి ని చూసి కోతులన్నీ ఏదో వింత జంతువు వచ్చిందని భయపడి అక్కడినుంచి పారిపోయాయి. కుట్టి అందం చూసి అందరూ మెచ్చుకుంటారు అనుకుంటే.. ఎందుకు భయపడి పారి పోతున్నారో కుట్టికి అర్థం కాలేదు. వెంటనే అక్కడే ఉన్న చెరువులో తన ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని తన స్నేహితుల దగ్గరకు ఏమీ తెలియనట్లు వెళ్ళింది. వానరాలన్నీ కలిసి కుట్టి దగ్గరికి వచ్చాయి. అటువైపు వెళ్ళకు అక్కడ మాకు ఒక వింతైన జంతువులు కనిపించింది. అని చెప్పాయి కుట్టికి నోటి నుంచి మాటలు రాలేదు. ఎందుకంటే ఆ వింత జంతువు తనేనని ధైర్యంగా చెప్పలేకపోయింది. తన స్నేహితులకు తాను ఎలా సహజంగా ఉంటానో అలాగే నచ్చుతానని గ్రహించింది. తన మనసులో ఉన్న కోరికను వదిలేసి ఇక నుంచి తన అందంతో కాకుండా మంచి పనులు చేసి అందరితో మెప్పు పొందాలని అనుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: