మంచిమాట : అల్పబుద్ధి కలవారికి అధికారం ఇవ్వకూడదు.

Divya

అనగనగా ఒక రాజ్యంలో ఒక మహా రాజు గారు ఉండేవారు. ఆ మహారాజు గారికి ఒక కోతితో ఎక్కువ చనువు ఏర్పడింది. ఆయన దానితోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఇక రాజు గారు అంటే కోతికి కూడా అభిమానం ఎక్కువ . ఇక ఆయనకు ఏ చిన్న హాని కలగకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేది ఆ కోతి. ఇక దాని అభిమానానికి మెచ్చి, రాజుగారు దానికి ఒక ఖడ్గం బహుమానంగా ఇచ్చి, దానినే తన అంగరక్షకునిగా నియమించుకున్నారు.
ఇక ఒకరోజు మహారాజుగారు గాఢంగా నిద్ర పోతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఎక్కడినుండి వచ్చిందో తెలియదు కానీ ఒక కందిరీగ రాజుగారు ముఖం చుట్టూ తిరుగుతూ ఝమ్ ఝమ్ అని శబ్దం చేస్తూ,  రాజుగారి నిద్రకు భంగం కలిగిస్తోంది. ఇక ఇది చూసిన కోతి వెంటనే కందిరీగ ను తన చేతితో అదిలించింది. ఇక అది పోయినట్టే పోయి మళ్ళీ వచ్చి గోల చేయసాగింది. ఇక కోతి తిరిగి మరోసారి ఆ కందిరీగను తన జేబురుమాలుతో బయటకు తోలి వేసింది. ఇక కాసేపు అయిన తర్వాత కందిరీగ మళ్ళీ వచ్చి ఎగురుతూ యధావిధిగా రాజుగారు ముక్కు పైన కూర్చుంది.
ఇక దాన్ని చూడగానే కోతికి ఎక్కడలేని కోపం వచ్చింది. రాజుగారు తనకు ఇచ్చిన కత్తిని తీసి, ఒక్క వేటుతో ఈగను చంపేసింది. ఇక కట్ చేస్తే, రాజు గారి ముక్కు కూడా తెగి కింద పడిపోయింది. ఇక రాజు గారు బాధతో మూలుగుతూ లేచి తన తప్పు వల్లే ఇలా జరిగిందని తెలుసుకున్నాడు.  కోతి ఉద్యోగాన్ని,  దాని కత్తిని పీకివేసి, దానిని తోటలోకి తరిమేయని బటులతో అని చెప్పారు. అందుకే అంటారు..అల్ప బుద్ధి ఉండే వారికి అధికారం ఇయ్య రాదు అని .
ఇక ఇదే కాదు ఏ విషయంలోనైనా సరే నిజజీవితంలో కూడా ఈ సంఘటనను ఉదాహరణంగా తీసుకోవాలి. ఎవరికి ఏ పని అయితే చేతనవుతుందో ఆ పని మాత్రమే చేయడానికి పురమాయించాలి. ఒకవేళ మనకు చేతకాని పని చేసి చిక్కుల్లో పడడం కన్నా మరొకటి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆచితూచి పనులు చేయడం నేర్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: