విమర్శలకు ..విరామం

SRIDHAR SHARMA
 జగన్ ను వదిలి జనంలోకి బాబు యువనేతపై నిత్యం ఆరోపణలు చేసే ‘నారా’నోటికి తాళం వేసుకున్నాడా. చీటకిమాటికి జగన్ ను జనంముందు విమర్శిస్తే చిత్తగించరని గ్రహించాడా?. జగన్ అవినితిని కడిగినా జనాల్లో ఆశించిన ఫలితాలు బాబు సాధించలేకపోయారన్నది తెలిసిందే. జనం సొమ్ము కోట్ల రూపాయలు జగన్ కొల్లగొట్టాడని బాబు గొగ్గోలు పెట్టినా లాభం లేకపోయింది. యువనేత లాంటి అవినీతి పరులను ప్రజలు దూరంగా ఉంచాలని చంద్రబాబు బహిరంగ సభల్లో పిలపునిచ్చినా ఫలితం లేకపోయింది. అక్రమాస్తుల కేసులో జగన్ జైలు కెళ్ళినా జనం విపరీతంగా ఆదరించడంతో ‘బాబు’తన పంథా మార్చకున్నాడు. అసమర్ధపాలన సాగుతోందంటూ ముఖ్యమంత్రిపై , అక్రమాస్తులు కూడగట్టుకున్నాడని యువనేతపై చేస్తున్న విమర్శలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్టు తెలుస్తొంది. రాజకీయాల్లో రాణించేందుకు ఇతర పార్టీ నేతలను విమర్శించడం పరిపాటే. రాజకీయంగా రాణించేందుకు, ఉనికి చాటుకునేందుకు పరస్పరం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తెలిసిందే. ప్రత్యర్థుల అసమర్థత, అవినీతిపై ఆగ్రహిస్తే జనాలు అనుగ్రహిస్తారని చంద్రబాబు భావించి భంగపడ్డాడు. దీంతో తాజాగా ‘నారావారు’ విమర్శల రూటు మార్చుకుని జనం బాట పట్టాడు. జనంలో ఉనికి చాటుకునే రాజకీయాలు చేస్తేనే జనాల అనుగ్రహం సాథ్యమని ఆలస్యంగా గ్రహించి అమలు చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి ఘోరంగా విఫలం కావడానికి గల కారణాలను చంద్రబాబు తన పార్టీ నేతలతో పలు దఫాలుగా విశ్లేషించారు. ఉప ఎన్నికల్లో ఓటమి కారణాలను కొంత వరకు తెలుసుకున్నారు. వాటిలో ప్రధానంగా టిడిపి నేతలు జనంతో మైమేకం కాకపోవడమేనని తేలడంతో బాబు తన రూటును మార్చాలని నిర్ణయించుకున్నారు. జనాథరణ పొందాలంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని పార్టీ కేడర్ కు ఆదేశాలిచ్చాడు. తాను ఆచరణలో పెడితేనే తన పార్టీ నేతలు ఆచరిస్తారని తన వంతుగా విజయవాడలో (దుర్గగుడి) ఫ్లైఓవర్ నిర్మించాలని ధర్నా చేపట్టాడు. ఈక్రమంలో చంద్రబాబు ధర్న మూలంగా సోమవారం విజయవాడ పసుపుమయమైంది. ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండాలే దర్శనమిచ్చాయి. నిత్యం జనాల్లో ఉంటూ, వారి సమస్యల కోసం పోరాటాలు చేస్తేనే ఎన్నికల నాడు జనాలు అనుగ్రహిస్తారన్న నిజం ‘బాబు’గారు ఆలస్యంగా గుర్తించాడని చెప్పక తప్పదు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: