జగన్ను కలవనున్న సంగ్మా

 హైదరాబాద్: రాష్ర్టపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీఏ సంగ్మా మరి కాసేపట్లో చంచల్గూడ జైలులో ఉన్నజగన్ను కలవనున్నారు. ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్డీఏ తరుపున రాష్ర్టపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగ్మా ఎన్నికల్లో తనకు మద్దతు కోరేందకు జగన్ను కలుస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జగన్ను కలిసి యూపీఏ అభ్యర్థికి ప్రణబ్కు మద్దతు ఇవ్వాలని కోరిన విషయం విధితమే. అయితే, ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ర్టపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చే విషయం స్పష్టం చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: