కార్యకర్తలతో రాయపాటి;ఏం చేద్దామంటారు

హైదరాబాద్: గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మరోమారు చేదు అనుభవం ఎదురైంది. మూడు దశాబ్దాల తరబడిగా పార్టీలో ఉంటున్న రాయపాటికి కాంగ్రెస్ పార్టీలో దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. టీటీడీ ఛైర్మన్ పదవీని ఆశించారు. అది కూడా దక్కలేదు. దీనితో రాయపాటి సాంబశివరావు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఏళ్లతరబడిగా పార్టీకి సేవ చేస్తున్నప్పటికీ పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనీ, దీనిపై త్వరలోనే పార్టీ అధినేత్రి సోనియాను కలవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వరుసగా ఎంపీగా ఎన్నికవుతున్నా కూడా రాయపాటికి కేంద్ర మంత్రి మండలిలో అవకాశం దక్కలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవీ కోసం అనేకమార్లు ప్రయత్నించారు. టీటీడీ ఛైర్మన్ పదవీ దక్కలేదు. ఏడాది కిందట కనుమూరి బాపిరాజును టీటీడీ ఛైర్మన్ చేసినప్పుడు రాయపాటికి అవకాశం కలపిస్తామనే హామీని పార్టీ అధినేత్రి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఈ దఫాకూడా రాయపాటికి మొండిచెయ్యి చూపించారు. దీనిని రాయపాటి తట్టుకోలేకపోతున్నారు. పదవుల విషయంలో రాయపాటికి భంగపాటు జరుగుతూనే వుంది. దీనితో రాయపాటిలో తీవ్ర అంసత్రుప్తి నెలకొంది. గతంలోనే రాయపాటి పార్టీకి దూరమవుతారనే ప్రచారం జరిగింది. తాజాగా మరోమారు కార్యకర్తల సమావేశాన్ని పెట్టుకుని ఏం చేద్దామనే అభిప్రాయాన్ని సేకరించినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పార్టీని వీడకున్నా, పార్టీ అధినేత్రి సోనియాను కలిసిన తరువాత రాయపాటి రాజకీయంగా ఓ నిర్ణయాన్ని తీసుకును అవకాశం లేకపోలేదనీ తెలుస్తోంది. ప్రస్తుతం సీమాంధ్రలో జగన్ హవా కొనసాగుతోంది.  గుంటూరు జిల్లాలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు, రాయపాటికి కూడా పడని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పార్టీ ఉండటంకంటి పార్టీని వీడటమే మంచిదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ పార్టీలో చేరితేనే బాగుంటుందనీ కార్యకర్తలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: