ఆర్థిక సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్: హిందూ పత్రిక కథనం

ఎపి ఆర్ధిక పరిస్థితి గందరగోళంగా ఉందంటూ హిందూ పత్రిక ఇటీవలే ఒక కదనాన్ని ప్రచురించింది. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుండడం, పలుమార్లు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లడం వంటి వాటిపై కేంద్రం, ఆర్బిఐ ఇప్పటికే  పలుమార్లు రాష్ట్రానికి హెచ్చరికలు పంపాయట. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అప్పు పుట్టకపోతే, ఏప్రిల్ నెల జీతాలను ఉద్యోగులకు చెల్లించడం కూడా కష్టమేనని ఆ కదనం చెబుతోంది. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు సేకరించిందట. దానిని పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి స్కీములకు ఖర్చు చేశారని చెబు తున్నారు. ఓట్ల కోసం జనం డబ్బును ఖర్చు చేయడంతో - ఇప్పుడు ఎపిలో ప్రభుత్వ ఆర్దిక పరిస్థితి సంక్షోభం లోకి వెళ్లిందని అంటున్నారు.

అప్పు చేయనిదే ఏపని చేయడానికి డబ్బులులేని పరిస్థితి ఏర్పడిందట. ప్రభుత్వ క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించటమే ఈ పరిస్థితికి కారణం అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు  ఓవర్డ్రాఫ్ట్  వినియోగించుకుందట. ఇంకా ఋణాలకోసం అవకాశాలను వెతుకుతుందట.


ది హిందూ కథనం:  

నూతన ఆర్ధిక సంవత్సరం మొదలైన  తొలి మాసం (ఏప్రిల్) మొదటి రెండు వారాల్లో మూడు సార్లు ఓవర్డ్రాఫ్ట్ ను వినియోగించు కొని ₹ 8000 కోట్లకు పైగా నూతన ఋణాలు వాడుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు ఇప్పుడు గనక  ఓవర్డ్రాఫ్టు, మార్కెట్ రుణాలు లభించకుంటే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొనే అవకాశం ఉందని అంటున్నారు. 

వాస్తవానికి, ఏప్రిల్ 1న, రాష్ట్ర ప్రభుత్వం ₹ 92 కోట్లు ఓవర్డ్రాఫ్ట్ కు అభ్యర్ధిస్తూ, అన్ని రకాల రాష్ట్ర ఆర్ధిక అవసరాల కోసం ₹ 5,000  కోట్ల ఋణం కోసం బహిరంగ మార్కెట్ నుండి ప్రయత్నించి, ఏప్రిల్ 4న బహిరంగ మార్కెట్ నుంచి ₹ 5000 కోట్ల స్వీకరించింది. దాని తరువాతి రోజులలో కూడా సుమారు ₹ 3200 కోట్ల ఓవర్డ్రాఫ్ట్  పొందింది. 

అంతే కాకుండా, ఇప్పుడు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి, ఉద్యోగుల జీతాలకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం పూల్ చేయ లేక పోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం తరచూ ఓవర్డ్రాఫ్ట్ కు ప్రయత్నించటం ఆర్థిక క్రమశిక్షణకు అంతరాయమని హెచ్చరిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

అధికారులు - రాష్ట్రంలో వేగంగా అలుముకుంటున్న ఆర్థిక సంక్షోభం గుర్తించారు. ఇప్పటికే అవసరాలు మితిమీరుతుండటంతో, వారు ఓవర్డ్రాఫ్ట్ మరియు ఓపెన్ మార్కెట్ రుణాలు కోసం వెళ్లవలసిన అవసరాన్ని వివరిస్తూ అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు ఆర్బిఐకి లేఖలు రాశారు. 

అంతేకాకుండా, ప్రస్తుత ప్రాజెక్టులు ఊపందుకుంటున్న తరుణంలో మరో  ₹ 1,000 కోట్ల ఋణాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని  అనుమతించాలని కోరారు. "ఈ  నెలలో ఉద్యోగుల వేతనాలు చెల్లించే విషయం తమను భయపెడుతుంది” అని తన పెరు చెప్పేటందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళా గ్రూపులకు, రాష్ట్ర మూలధనాన్ని హరించి వేసే పసుపు కుంకుమ, అన్నదాతా సుఖీభవ, వ్యవసాయదారులకు ఆర్థిక మద్దతు పథకం, వోటు-ఆన్-ఖాతా నుండే ఉపయోగించింది. 

ఏప్రిల్ 11న జరిగిన సాధారణ ఎన్నికల ముందు ఈ పథకాలు కూడా అమలు చేయబడ్డాయి. ఆన్నధాత సుఖీభవ పదకం  కింద ప్రభుత్వం ఒక్కో రైతు ఖాతాకు ₹ 4,000 చొప్పున జమ చేసింది మరియు డ్వాక్రా సమూహాలలోని  ప్రతి సభ్యురాలికి  ₹ 10,000 ను  పసుపు కుంకుమ పథకం కింద 94 లక్షల మంది డ్వాక్రా మహిళా లబ్ధిదారుల ఖాతాలకు మూడు వాయిదాలలో జమ చేశారు. పసుపు కుంకుమ క్రింద ఫిబ్రవరి 1న ₹ 2500, మర్చ్ 8న 3500, ఏప్రిల్ 4న ₹ 4000 తుది విడతగా ఖాతాల్లో జమచేసింది. ₹5000 కోట్లు అన్నదాతా సుఖీభవ పథకానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కేటాయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: