చంద్రబాబు డిప్రెషన్ జగన్ ని ముఖ్యమంత్రి చేస్తుంది?

సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే అధికారాన్ని చేజిక్కించు కోవాలని, ప్రతిపక్షనేత జగన్మోహనరెడ్డిని అదే ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టాలని నిర్విరామంగా కష్టపడుతున్నారు. అందుకు గాను నారా చంద్రబాబు నాయుడు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా కులాల వారీగా మతాల వారీగా ఓట్లు రాబట్టుకునేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు 

ఇందుకు గాను తానొక కొత్త వ్యూహాన్ని నిర్మించుకున్నారు. జాతీయ స్థాయి నాయకులను రాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలోకి దిగుమతి చేసి  వారి ఉపన్యాసాలతో చంద్రబాబు ఇంత... అంత... అంటూ వారి చేత ప్రచారం చేయించి ప్రజలని ఆకట్టుకునే ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ ఎన్నికల కోసం కష్టపడనంతటి స్థాయి లో కష్టపడుతూ ఏ ప్రయత్నమూ వదలకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు 

ఈ క్రమం లోనే జగన్మొహనరెడ్డి నవరత్నాల్లోని  కొన్నింటిని ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు పించన్, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ మొదలైన పేర్లతో పథకాలు రచించి అమలు చేస్తూ ప్రజలని తమ వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు మోదీ-జగన్-కెసిఆర్ కలిసి ఆంధ్ర ప్రదేశ్ పై కుట్రలు చేస్తున్నారని ప్రజలను నమ్మించే ప్రయత్నంలో పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య జగనే చేయించాడనే ఆరోపణలతో జగన్ పై ప్రజలలో అభద్రతా భావం కలిగించేలా తమ నేతలతో వ్యాఖ్యలు కూడా చేయించారు. అయితే ఇవన్నీ చాలవన్నట్టు ఏపీలో ఎన్నికల ప్రచారానికి జాతీయ నాయకులను ఏపీకి తీసుకు వస్తున్నారట చంద్రబాబు. 

చంద్రబాబు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ముస్లిం ఓట్లు అధికంగా ఉండే కడప జిల్లాలో ప్రచారం చేయించారు. ఆయనే కాకుండా మరి కొంత మంది నాయకులు కూడా రంగంలోకి దింపేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారట. 

ఢిల్లీ సీఎం క్రేజీవాల్ తో విజయవాడ విశాఖపట్నంలో ప్రచారం చేయించి విద్యాధికుల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవు లతో ప్రచారం చేయించి ఏపీలో యాదవుల ఓట్లును తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారట. 

మమతా బెనర్జీ ని సైతం తీసుకువచ్చి విశాఖపట్నంలో ప్రచారం చేయించి బ్రహ్మణుల ఓట్లను తన కిట్టీలో వేయించు కోవాలని - అలాగే కర్ణాటక నుంచి దేవగౌడని ప్రచారంలోకి తీసుకువచ్చి ఇక్కడి గౌడ కులస్తుల ఓట్లు తనకే పడేలా చేసుకోవాలని చంద్రబాబు పదకాలు వ్యూహాలు రచిస్తున్నారు. 

ఎన్నేళ్ళ అనుభవం అని కాదు! చెప్పింది, చెయ్యాల్సింది, మడమ తిప్పకుండా, చేసేయటమే సీదా రాజకీయ నాయకత్వ లక్షణం. గెలుపుకు షార్ట్ -కట్ ప్రజాసేవని నమ్మే జగన్మోహనరెడ్డి మాత్రం ప్రజల్లో ఉంటూ ఇదే అంశం  ఉపయోగించుకుని లాభపడాలని చూస్తున్నారు.

చంద్రబాబుకు అనుకూలంగా జాతీయనేతలంతా ప్రచారానికివస్తే, ఒకేఒక్క జగన్మోహనరెడ్డిని ఎదుర్కోవడానికి ఎంతోమంది ముప్పేటదాడి చేస్తున్నారు కానీ జగన్మోహన రెడ్డి తన తండ్రిలా ఒంటరి పోరు చేస్తున్నారు అంటూ ఇదే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లి లాభపడాలని వైసీపీ భావిస్తోంది. ఇదే గనుక జరిగితే జగన్మోహనరెడ్డిపై మరింత సానుభూతి పెరిగి వైసీపీ లాభపడే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: