చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తున్న సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.  అయితే  ఈ హత్యపై ఎన్నో కథనాలు వెలుగు లోకి వస్తున్న నేపథ్యంలో టీడీపీ మాత్రం ఇది సొంత కుటుంబీకులు చేసిన పని అని..రాజకీయ లబ్ది కోసమే అని..సానుభూతి కోసం ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా చంద్రబాబే అంటున్నారు.  మరోవైపు ప్రతిపక్ష నేత ఈ కేసును నిష్పక్షపాతికంగా విచారణ జరిపించాలని.. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని..నిందితులను త్వరగా పట్టుకోవాలని అంటున్నారు. 

తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత ప్రెస్ మీట్ లో ఎన్నో సంచలన విషయాలు మాట్లాడారు.  700మందితో అతిపెద్ద కుటుంబమైన మాకుటుంబ పెద్ద జగనన్న అని ఆయన్ను ముఖ్యమంత్రి చేయాలని మానాన్న అహర్నిశలూ శ్రమిస్తున్నారని ఇలాంటి సమయంలో జరిగిన దారుణ హత్యతో మేమంతా బాధ పడుతుoటే, పేపర్లు టీవీలలో ఇన్వెస్టిగేషన్ ను ప్రభావితం చేసేవిధంగా ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు తీర్పులు చెప్తూ మమ్మల్ని ముఖ్యంగా నాన్నగారికి ప్రాణంతో సమానమైన ఏకైక కుమార్తెను అయిన నేను, నన్ను బాగా ప్రేమించే  నాన్నను గురించి చెత్త రాతలు, సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయనను అవమానించారని గద్గద స్వరంతో ఆమె విలపించారు.

ఇప్పటికైనా చంద్రబాబు శవరాజకీయాలు మానుకుంటే మంచిదని అన్నారు.  దర్యాప్తుచేస్తున్న వారిని ప్రభావితంచేసేలా  స్వంత  తీర్పులు ఇచ్చేసి జగన్ పై అసత్యాలు ప్రసారం చేస్తున్నాయి. My father's dream is to see Jagananna as CM, for that he has been working... దయచేసి గమనించండి దర్యాప్తుసంస్థను ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యనివ్వండి. అసత్య విశ్లేషణలు చేయకండి అని ఆమె వేడుకున్నారు.  శవరాజకీయాలు చేస్తూ ఎన్నికల ప్రచార సభల్లో కూడా చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం జగనే చంపించినట్లుగా ప్రజల్లో సందేహం కలిగేలా ప్రసంగాలు చేయడం ఎంత దుర్మార్గమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  

సీట్లు కేటాయించిన తర్వాత కూడా అభ్యర్థులు పార్టీని ఫిరాయించడం, కళ్ళముందు పరాజయం దర్శనమిస్తుంటే అసహనంతో ఒక సౌమ్యుడు, అజాతశత్రువు దారుణహత్యను కూడా రాజకీయం చేసి పది ఓట్లు పొందాలన్న దురాశతో అత్యంత హేయంగా చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇకనైనా ఈ అసత్యాలకు స్వస్తి పలకకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: