హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ మెల్లమెల్లగా తన కుర్చీని పదిలం చేసుకుంటున్నారు. రాష్ర్టంలో మరింత బలపడే విధంగా చూసుకుంటున్నారు. కిరణ్ నిన్న ఢిల్లీ వెళ్లే వరకు కిరణ్ సీఎం కుర్చీకిందకు నీళ్లు వచ్చాయనీ, కిరణ్‌ను దించడం ఖాయమనీ జోరుగా ప్రచారం జరిగింది. కానీ, కిరణ్ మాత్రం ఢిల్లీ వెళ్లిన తరువాత రాజకీయాలను తనకు అనుకూలంగా మల్చుకోవడమే కాకుండా, 2014వరకు తన కుర్చీకి ఎలాంటి ఢోకా లేకుండా చేసుకుంటున్నారు.
కిరణ్ సీఎం కావడానికి సహకరించిన కేంద్రంలోని ఓ ముఖ్యమైన మంత్రి ద్వారానే మళ్లీ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాష్ర్టంలో పార్టీ అస్తవ్యస్తంగా వుంది. కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం రాష్ర్ట సర్కార్‌ను ఏమాత్రం కదిలించిన తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందనీ సదరు మంత్రి అధిష్టానానికి చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. రాష్ర్టానికి తోడుగా కేంద్రంలోనూ పార్టీ, ప్రభుత్వ పరిస్థితులు అంత బాగా ఏమీ లేవు. అనేక కుంభకోణాలతో యూపీఏ కొట్టుమిట్టాడుతోంది.
సోనియాకు బోలెడు సమస్యలున్నాయి. ఈ తరుణంలో రాష్ర్ట సర్కార్‌ను ఏమాత్రం కదిపిన అది కాంగ్రెస్‌కు నష్టమే కలిగిస్తుంది తప్ప లాభం లేదనే అభిప్రాయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుత సీఎంకు రాష్ర్టంలో తనకంటూ చెప్పుకోదగ్గ గ్రూపులు లేవు. ఉన్నకాడికి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్నారు.
ఇటువంటి వ్యక్తిని మార్చి కొత్త వ్యక్తిని సీఎంగా నియమించడం వల్ల కొత్తగా సమస్యల్ని ఏరికోరి తెచ్చుకోవడమే అవుతుందనే ఉద్దేశంతో వచ్చే ఎన్నికల దాకా సీఎంను మార్చకుండా, కళంకిత మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సో...ఇప్పటికిప్పుడు కిరణ్‌కు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నమాట.
మరింత సమాచారం తెలుసుకోండి: