రౌండ్ రౌండ్ కూ వైఎస్ఆర్ సీపీ ఆధిక్యత

 హైదరాబాద్: ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యతను చాటుకుంటున్నారు. తొలుత తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డితో ప్రారంభమైన ఈ ఆధిక్యత మిగతా అన్ని స్థానాలలో కనబర్చింది. తొలుత వందల్లో ఆధిక్యతలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు రెండో రౌండ్, మూడో రౌండ్ కు వచ్చే సరికి వారి ఆధిక్యత వేలలోకి వెళ్లింది. పాయకరావుపేట, మాచర్ల, పత్తిపాడు, తిరుపతి తదితర నియోజక వర్గాల్లో టీడీపీ గెలుపుపై ఆశను పెట్టుకుంది.  కానీ, ఎక్కడా కూడా టీడీపీ ఆశించిన విధంగా ఓట్లను రాబట్టలేకపోయింది. పరకాల విషయానికి వస్తే రెండో రౌండ్ లెక్కింపుకు వచ్చే వరకు టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి 1900 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నాడు.  ఇదిలా ఉంటే రామచంద్రాపురం విషయంలో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు ఆధిక్యతలోకి వచ్చాడు. తిరుపతిలో కాంగ్రెస్-వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల మధ్యన హోరాహోరీగా పోటీ నెలకొంది. నెల్లూరు పార్లమెంటు విషయాని వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి హవాను కొనసాగిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: