సుధాకర రెడ్డి తో "క్విడ్ ప్రో కో"! చివరి ఘడియ లో వివేకా లేఖ! అనుమానాలకు అంతముందా?

వైఎస్ రాజారెడ్డి హంతకులకు ఈ మద్యనే క్షమాభిక్ష పెట్టి తద్వారా వైఎస్ వివేకానందరెడ్డి హత్యను సాధించుకున్నారా? అనేది రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకున్న అనుమానాస్పధ ప్రశ్నగా వినిపిస్తుంది.  ఈ హత్యకేసులో సుధాకర రెడ్డి అనే వ్యక్తి పేరు వినిపిస్తోందని సమాచారం. ఈ సుధాకర రెడ్డి అంటే వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో “అక్యూజ్డ్ నెంబర్ 8” ఈ కేసులో మొత్తం 13 మందికి యావజ్జీవశిక్ష విధించింది నాడు హైకోర్టు. పైగా దీనిని సుప్రీంకోర్టు ధృవీకరించింది.

అయితే భూమి గుండ్రంగా ఉందన్నట్టు గత ఏడాది వీళ్లందరికీ క్షమాభిక్ష పెట్టేసింది ఏపి లోని నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం ఫ్రభుత్వం. 
ఈందులో కీలక విషయం ఏమంటే వైఎస్ రాజారెడ్డి ధారుణ హత్య  జరిగి నపుడు అధికారంలో ఉన్నది ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వమే. ఇప్పుడు క్షమాభిక్షపెట్టినపుడు అధికారంలో ఉన్నదీ అదే ప్రభుత్వం. ఇక్కడే కీలకాంశం నేరారోపణ జరగటం – విచారణ జరగటం- శిక్ష పడటం – ఆపై క్షమాభిక్షపెట్టినది చంద్రబాబు ప్రభుత్వమే. ఆ విధంగా క్షమాబిక్షపై విడుదలైన సుధాకరరెడ్డి మీదనే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు, బంధువులు అనుమాన పడుతున్నారని సమాచారం. 

హంతకులకు కోర్టు యావజ్జీవం వేస్తే, వాళ్లకు మధ్యలోనే క్షమాభిక్ష ప్రసాదించేసి, మరో ధారుణహత్యకు కారకులయిందెవరు? ప్రభుత్వమేనా? రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని విధంగా సరైన విచారణ జరిగితే తప్ప నిజా నిజాలు బయట పడవు. ఆంతవరకు ఈ ప్రశ్నకు సమాధానం లేదు. 


వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతపై ఇప్పుడు మరో తీవ్రమైన అనుమానం వెలుగుచూస్తూ దానిపై కీలక చర్చ నడుస్తోంది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వివేకాను పడకగదిలోనే గొడ్డలితో నరికి చంపేసిన దుండగులు, దానిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు శవాన్ని బాత్ రూంలోకి తీసుకెళ్లారు. బాత్ రూంలో తల కమోడ్ కు తగిలి చనిపోయినట్టుగా రక్తం కమోడ్ కు పూసి దృశ్యం సృష్టించి దుండగులు గుట్టు చప్పుడు కాకుండా తప్పుకున్నారు. 

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న,  రాగిపిండి సుధాకర్‌రెడ్డిని క్షమాభిక్ష పేరిట రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాన్ని గత జూన్ లో  అమలు చేసింది. 


తెల్లారిన తర్వాత హత్య వెలుగులోకి రాగా, వైఎస్ ఫ్యామిలీ షాక్ లో కూరుకుపోయింది. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్యను రాజకీయం చేసేందు కు పక్కాగానే యత్నాలు జరుగు తున్నట్లుగా కనిపిస్తుంది. తన చిన్నాన్నను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారని - నిందితులు ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి డిమాండ్ చేశారు. అయితే దీనిపై జగన్ డిమాండ్ కు ముందే అత్యంత పకడ్బంధీ గా అధికార టీడీపీ నూతన  వాదనను తెరపైకి తెచ్చిందని, వివేకా హత్యను రాజకీయం చేయాలని అనుకుంటున్నారంటూ తిరిగి   వైఎస్ కుటుంబం పైనే టీడీపీ నేతలు. మంత్రులు - చివరకు సీఎం నారా చంద్రబాబునాయుడు తమదైన శైలిలో వాదనల ద్వారా నిందలు మొదలెట్టినట్లు తెలుస్తుంది. ఇదంతా టిడిపి సామాజిక టెలివిజన్ చానళ్ళు సహస్ర కోటి స్వరాలతో ఆయన మరణాన్ని మించిన స్థాయిలో ప్రచారం ఊపందుకుంది. 

ఈ క్రమంలో తన చివరి క్షణాల్లో వివేకా రాసినట్టుగా చెబుతున్న లేఖ చుట్టూ మరో కొత్త చర్చ నడుస్తోంది. అసలు తనపై గొడ్డలితో కిరాతకంగా దాడి జరిగితే, స్వయంగా వివేకా ఎలా లేఖ రాశారన్నది మరో కీలక చర్చనీయాంశమై కూర్చొంది.  అర్ధరాతో, అపరాత్రో, ఇంటిలో ఒంటరిగా ఉన్న తనపై దుండగులు దాడికి దిగి, దాడి చేసిన తర్వాత వారు వెళ్లిపోయాక వివేకా లేఖ రాసినట్టుగా ఒక కథ వినిపిస్తోంది. అసలు వివేకా పై దాడి చేసిన దుండగులు ఆయన చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత నే, శవాన్ని బాత్ రూంలోకి లాక్కెళ్లి, దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించారన్న మరో వాదన వినిపిస్తోంది.

ఒకవేళ వివేకాపై దాడిచేసిన నిందితులు ఆయన మరణించకుండానే వెళ్లిపోయినా, తన శరీరంపై గొడ్డలి వేట్లకు తీవ్ర గాయాలుకాగా, ఆ గాయాల కారణంగా వచ్చిన తీవ్ర మైన నొప్పిని తట్టుకుని కూడా వివేకా లేఖ రాసేశారా? అసలు అలా రాయగలరా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 

అయినా వివేకా రాసినట్టుగా చెబుతున్న సదరు లేఖలో వివేకా ఏం రాశారన్న విషయంలోకి వస్తే, “నా కారు డ్రైవరు, నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడినాను. డ్రైవర్ ప్రసాద్ ను వదిలిపెట్టొద్దు... ఇట్లు వివేకానందరెడ్డి” అని ఆ లేఖలో ఉన్నట్లుగా ఇటు పోలీసులతో పాటు అటు అధికార టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు టిడిపి మద్దతు మీడియా హోరెత్తున ప్రచారం చేస్తుంది.

మరి ఈ వాదన ఎంతవరకు నిజం? లేదంటే, ఈ హత్యకేసును తప్పుదోవ పట్టించి-హత్యను వైసీపీ పైనే నెట్టేసేందుకు జరుగుతున్న కుట్రనా? ఆసలిందులో నిజమెంత – కుట్ర కోణమెంత అనేది సరైన విచారణ సరైన రీతిలో జరిగితే తప్ప తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: