వైఎస్ఆర్ సీపీ ఆధిక్యత

   హైదరాబాద్: ఊహించిన విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతతోనే కొనసాగుతోంది. అంతటా ఫ్యాన్ గాలి వీచే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి రౌండ్ లోనే తిరుపతి, ఆళ్లగడ్డ, రాయచోటి, రాజంపేట, నర్సన్నపేట, పోలవరం, ఎమ్మిగనూరు తదితర అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతను కొనసాగిస్తున్నారు.మొదటి రౌండులోనే వేలాది ఓట్ల ఆధిక్యతను కనబరుస్తున్నారు. తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి 14 ఓట్ల ఆధిక్యతతో ఉండటంతో ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి 3500ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. అదే విధంగా రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి 3900 ఓట్ల ఆధిక్యతతో ఉన్నాయి. పరకాలలో టీఆర్ఎస్ ఆధిక్యతతో ఉన్నారు. ఓట్లలోనే కాకుండా, పోస్టల్ బ్యాలెట్లలో కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకు అధికంగా వచ్చాయి. మొత్తానికి మెజార్టీ స్థానాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్లలో టీడీపీ ఎక్కడా కూడా కనిపించకపోవడం గమనార్హం.       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: