ఎట్టకేలకు దిగివచ్చి దళితులకు క్షమాపణలు చెప్పిన చింతమనేని..!

KSK
ఇటీవల తెలుగుదేశం పార్టీ దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలో శ్రీరామవరం ప్రాంతంలో ఉన్న దళితుల గురించి చేసిన కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ అయింది. ముఖ్యంగా చింతమనేని దళితులను ఉద్దేశించి చేసిన కామెంట్లపై చాలామంది నెటిజన్ల తో పాటు దళిత సంఘాలు మండిపడ్డాయి.


దీంతో పరిస్థితి అదుపు తప్పుతున్న క్రమంలో దళితులను దూషించిన టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కండిషన్ లతో కూడిన క్షమాపణ చెప్పారు.వీడియోని పూర్తిగా చూడకుండా తనను తప్పుగా అర్దం చేసుకున్నవారికి క్షమాపణలు చెబుతున్నానని ఆయన తెలిపారు.


తనను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తనను దోషిగా నిలబెట్టడానికి కుట్ర జరిగిందని ఆయన అన్నారు. ఈ విషయంలో తనపై దుష్ప్రచారం చేసిన సాక్షి మీడియాపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.


కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.నిజంగానే నేను తప్పుగా మాట్లాడితే అక్కడున్న వారంతా చప్పట్లు, ఈలల ఎందుకు వేశారని ప్రశ్నించారు. తాను తప్పుగా మాట్లాడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్‌ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: