నాగబాబు మధ్యలో బలైపోతాడేమో

Prathap Kaluva

నాగబాబు ఎన్నికల సమయంలో తన తమ్ముడు పెట్టిన జనసేన పార్టీ కి తనదైన సహాయం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో టీడీపీ  వైస్సార్సీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ జనసేన కు సహాయం చేస్తున్నాడు. ఓవైపు పవన్ కల్యాణ్ జనసేనకు మద్దతునిస్తూనే.. చంద్రబాబు - జగన్ టార్గెట్ గా విమర్శలు - వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇవి కూడా జనానికి బాగానే చేరువ అవుతున్నాయి. అయితే.. ఇదే సమయంలో నాగబాబుపై విమర్శలు కూడా వస్తున్నాయి.


పవన్ కల్యాణ్ టీడీపీలో ఉన్నంతకాలం ఈ విమర్శలు ఎందుకు చేయలేదు అనే ప్రశ్న కూడా నాగబాబుకు ఎదురవుతుంది. మరోవైపు.. ఏపీలో ఎన్నికల పొత్తులు ఇంకా ఖరారు కాలేదు. ఎవరు ఏ పార్టీతో కలిసి వెళ్తారో ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. చంద్రబాబు నాయుడు పవన్ వైపు ఆశగా చూస్తుంటే.. పవన్ మాత్రం సోలోగా పోటీ చేస్తానంటున్నాడు. మరి ఏం జరుగుతుందో తెలియదు. 


మరోవైపు జగన్ - పవన్ ఇద్దరూ కలిసి పొత్తు ఏర్పరచుకున్నా - లేకపోయినా.. రాబోయే రోజుల్లో లోపాయకారి ఒప్పందం ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఉంటే మాత్రం జగన్ ని ఇంతగా విమర్శిస్తున్న నాగబాబు చిక్కుల్లో పడక తప్పదు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయిపోయాడో తెలియడం లేదు. ఎన్నికల వేళ యాక్టీవ్ గా ఉండాల్సింది పోయి, కామ్ అయిపోవటం జనసేన సైనికులకు కూడా నచ్చడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: