సర్వేల్లో వైస్సార్సీపీ ప్రభంజనం ... టీడీపీ లో మొదలైన అలజడి ..!

Prathap Kaluva

2019 ఎన్నికలకు మరెంతో దూరంలో లేవు. గట్టిగా రెండు మూడు నెలల్లో ఎన్నికలు వచ్చేస్తాయి.  ప్రతి సర్వేలో వైస్సార్సీపీ అధికారం లో కి వస్తుందని చెబుతుంది. అయితే 2014 లో కూడా సర్వేలు వైస్సార్సీపీ అధికారం లోకి వస్తుందని చెప్పాయి. అయితే తరువాత మారిన పరిస్థితులు జగన్ కు అధికారాన్ని దూరం చేశాయి. అయితే ఇప్పడూ టీడీపీ మీద ప్రజా వ్యతిరేకత ఉంది. పైగా జనసేన టీడీపీ కి మద్దతు ఇచ్చే పరిస్థితి లో కనిపించడం లేదు .


దీనితో టీడీపీ నాయకత్వం లో అలజడి మొదలైందని చెప్పాలి. ఈ ఎన్నికలు టీడీపీ కి చాలా ముఖ్యమని చెప్పాలి.  ఇప్పడూ తాజాగా టైమ్స్ నౌ.. స్టేట్ ఎన్నికల గురించి కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో సర్వే చేసి చెప్పింది. ఇందులో.. మొత్తం 25 సీట్లకు గాను వైసీపీకి 23 వస్తే.. టీడీపీకి కేవలం రెండంటే రెండే దక్కాయి. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలున్నాయి. వీటిల్లో 23 సీట్లు కేవలం వైసీపీకి వస్తాయట.


ఇక మిగిలిన రెండు సీట్లు టీడీపీకి వస్తాయని టైమ్స్ నౌ సర్వే తేల్చిచెప్పింది. కాంగ్రెస్ - బీజేపీ - జనసేన.. అసలు పోటీలోకి కూడా రావని చెప్పేసింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే దాదాపుగా రాష్ట్రంలోనూ వస్తాయి. దీన్నిబట్టి చూస్తే.. వైసీపీకి దాదాపు 140 సీట్లకు పైనే వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంటే ఎలా చూసినా ఈసారి వైసీపీకి అధికారం దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఈ ఫలితాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చేవి. కానీ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉంది. ఈ లోపు ఏదైనా జరగొచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: