కొత్త పదవి రేసులో ఇవాంకా ట్రంప్..!

KSK
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూతురు ప్రపంచ స్థాయిలో  వివిధ రంగాలలో తండ్రికి తగ్గ కూతురుగా రాణిస్తుంది. గతంలో ప్రపంచ స్థాయిలో హైదరాబాదు నగరంలో జరిగిన వ్యాపార సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇవాంకా ట్రంప్ తాజాగా ఆమె మీద కొత్త వార్త బయటకు వచ్చింది.  


ఇంతకి విషయం ఏమిటంటే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అతని సర్వీసు ఇంకా 3 ఏళ్లు ఉండగానే ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం నాడు చెప్పారు.


దీంతో అధ్యక్ష రేసులో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో యూఎస్‌ అంబాసిడర్‌ నిక్కీ హేలీ, అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ కూడా అమెరికా అభ్యర్ధులుగా బరిలో దిగబోతున్నారని తెలుస్తుంది. ఇవాంకా 2017లో మహిళా వ్యాపారవేత్తల సాధికారత కోసం దాదాపు వంద కోట్ల డాలర్ల నిధులను సేకరించి అందర్నీ ఆకట్టుకున్నారు.


ఐతే వర్లల్డ్‌ బ్యాంకులో ఎక్కువ శాతం షేర్లు అమెరికావే. ఆ బ్యాంకుకు అమెరికా ప్రతిపాదించిన వ్యక్తులే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. వచ్చే నెల నామినేషన్ల ప్రక్రియ జరగనుందని, ఏప్రిల్‌లో వరల్డ్‌ బ్యాంకు నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: