టుడే స్పెషల్: రాహుల్ చెంప చెళ్ళుమనిపించి - కాంగ్రెస్ కొంప కూల్చిన - రాఫెల్ డీల్ పై సుప్రీం తీర్పు

రాహుల్ గాంధి రాఫెల్ డీల్ అంటూ కేంద్రంపై గత ఆరు నెలలుగా తీవ్రంగా చెలరేగిపోయారు. ఈ డీల్ లో లోపాలు ఉన్నాయని చెప్పే ముందు దానిపై లోతైన విచారణ ఎంతో కొంత చేసిన తరవాత ముందుకు వెళ్ళవలసి ఉంది. ఇందులో ఆయన ఆయన ఆ దిశలో చేసిన ప్రయత్నాలు ఏమీ ఉన్నట్లు కనిపించదు. రాహుల్ గాంధికి ఇప్పుడు ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం చెప్పిన తీర్పు చెంపపెట్టు. ఇప్పటివరకు అవినీతి మచ్చలేని నిష్కళంక ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిపై ఆరోపణలు చేసే ముందు బోఫోర్స్ లాంటి రక్షణ పరికరాల కొనగోలులో అవకతవకలు చేసి అవమానాలపాలై, అధికారం కూడా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అధినేతల కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధి తీరు ప్రశ్నార్ధకమేనని చెప్పవచ్చు.


కాంగ్రెస్ నాయకుల అవినీతి కళ్ళకు ఇతరులలోనూ అవినీతే కనపడుతుంది. అందుకే యువనాయకుడు కళ్ళు నులుముకొని మరీ పదిసార్లు సరిచూసుకొని మాట్లాడాల్సిన అవసరముంది. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనె రైతు ఋణ మాఫీ అని చెప్పిన కాంగ్రెస్ కర్ణాటకలో ఇంతవరకు ఋణ మాఫీ చేయలేదు. మద్యప్రదేశ్, రాజస్థాన్, చత్తిస్ గడ్ రాష్ట్రాల ప్రజలకు కూడా అదే హామీ ఇచ్చి గెలిచి నాలుగు రోజులవు తున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటుకూడా చేయలేక పోతున్నారు. మరి ఈ రాష్ట్రాల్లో ఋణ మాఫీ ఇంకో ఆరు రోజుల్లో చేస్తారన్న హామీ కనిపించట్లేదు.


ఇంతవరకు యువకులదే అధికారమన్న రాహుల్ గాంధి మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కమలనాథ్ ను ఎంపికచేయటం జ్యొతిరాధిత్య సింధియా లాంటి సమర్ధులకు ఎలా ప్రోత్సాహమిస్తుంది? రాహుల్ గాంధి చెప్పేదొకటి యధార్ధంగా అమలు చెసేదొకటని దీంతో ఋజువౌతుంది. దాదాపు అదే పరిస్థితి రాజస్థాన్ లో కూడా కొనసాగుతుంది.


ఇక తెలంగాణా విషయానికి వస్తే రాహుల్ గాంధి తెలివితేటలు వికటించి చంద్రబాబు నాయుణ్ణి నమ్మి టిడిపితో పొత్తు పెట్టుకొన్న కాంగ్రెస్ తెలంగాణాలో సర్వనాశనమై పోయింది. చంద్రబాబు నాయుడి మాటలకు పడిపోయి పొత్తు పెట్టుకోవటం రాహుల్ గాంధి అమాయకత్వం, విఙ్జతలేమిని చూపించటమే కాక, ఈ సువిశాల భారతావనిని పాలించటానికి, నేతృత్వం వహించటానికి ఆయన పరిఙ్జానమే కాదు సామర్ధ్యం సరిపోతుందా? అన్నది చాలామంది నరెంద్ర మోడీకి ప్రత్యామ్నాయం కోసం చూసేవారికి అనుమానాస్పధం అవుతుంది. ఇది దేశానికి నేతృత్వం వహించాలని కోరుకు నే వారికి చాలా ప్రధానమైన విషయం. ఆఫ్ట్రాల్ చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసిన పొత్తుకే ఇలా పడిపోతే ఎలా? పొత్తు అంత సులభమా? (ఇంకేం ప్రలోభాలున్నాయో? తెలియదు) కనీసం తెలంగాణాలో రాజకీయాల్లో ఆరితేరి ఉన్న తన పార్టీ సీనియర్లతో, అనుభవఙ్జులైన సభ్యులతో, ఇతర రాజకీయ విశ్లేషకులతో అయినా  చర్చలు లేకుండా పొత్తు అంగీకరించి ఉండటం తీవ్ర నిరాశకు దారి దీసింది.


ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణా రాష్ట్ర వ్యాప్త ప్రజలు ఎన్నికల్లో ప్రదర్శించిన వ్యతిరేఖతే నేడు తెలంగాణాలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావుకు అందివచ్చిన అందలం. ఈ విజయం కేసీఆర్ ప్రజలకు చేసిన సేవ ద్వారా లభించింది మాత్రం కాదు. చంద్రబాబు మీద తెలంగాణా ప్రజలకున్న అసహ్యత అంత ధారుణంగా వ్యక్తమైంది.


రాఫెల్ డీల్ కేసు కొట్టేస్తూ సుప్రీం కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. *మాకు రాఫెల్ డీల్ కు సంబంధించి ఏమీ అనుమానాస్పదంగా కనిపించడం లేదని ఆ వివాదంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అనుమానాలు అవసరంలేదని వాటి ఖరీదెంత తదితర విషయాలు పరిశీలించాల్సిన అవసరం లేదను కుంటున్నాము* అని చెప్పింది.


రక్షణశాఖ కొనుగోళ్లు సున్నితమైన అంశమని అందులో గోప్యత పాటించే హక్కు ప్రభుత్వానికి ఉందని కోర్టు చెప్పింది. ఇందులోలోతుగా విచారణ జరపాల్సి న అవసర మేదీలేదని స్పష్టం చేసింది.


ఈ డీల్ విషయంలో నరేంద్రమోడీ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. చాలాసార్లు మోడీ దీని గురించి ఏమీ స్పందించలేక పోయారు. ఒకటి రెండు సార్లు మాత్రమే దీనిని అబద్ధమని చెప్పారు కాని చాలా సార్లు మౌనంగానే ఉన్నారు. కారణం పలుమార్లు మాట్లాడితే సున్నితాంశాలను స్పృజించవలసిన అవసరం రావచ్చు. ఆది దేశానికి శ్రేయస్కరం కాదు. ఆ నేపథ్యంలో నేటి త్రిసభ్య సుప్రీం ధర్మాసనం తీర్పు సమస్య కు తీరైన సమాధానం చెప్పింది. అదే ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.


ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తీర్పురాగానే, ఆఫ్-సెట్ భాగస్వాముల విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదని సుప్రీం కోర్టు గుర్తించిందని - అలాగే అసలు విచారణ చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొందని అమిత్ షా వ్యాఖ్యానించారు. అనవసర రాద్ధాంతం చేసే వారికి ఇది చెంపపెట్టు వంటి తీర్పు అమిత్ షా పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే, సుప్రీం ధర్మాసనం ప్రకటన తరవాత కూడా దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.  వ్యవస్థల్ని మేనేజ్ చేయడం బీజేపీకి  కొత్త కాదు. అయితే విధంగా న్యాయ వ్యవస్థనీ మేనేజ్ చేసిందని మాకు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.


జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే సుప్రీం ధర్మాసనం తీర్పుని కూడా ప్రక్కదారి పట్తించి దాన్ని ఒక ఆయుధంలా చేసుకునే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉన్నట్లుంది. ఎలా అంటే, కాంగ్రెస్ ఓటమి చవిచూసిన తెలంగాణాలో దానికి ఈవీఎంలు టాంపరింగుకు గురయ్యాయని ప్రచారం చేస్తారు. అలా కాకుండా వాళ్ళు గెలిచిన చోట ఈవీఎం లు చక్కగా పనిచేశాయని అంటారు. అది రాహుల్ గాంధి గౌరవాన్ని పెంచదని ఆయన గుర్తుంచు కోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: