బర్త్‌ డే స్పెషల్‌: తమిళనాడు నెక్స్ట్ సీఎం రజినీకాంతేనా..?

Chakravarthi Kalyan
రజినీకాంత్.. తిరుగులేని నటుడు.. ఈ మాటకూ తిరుగులేదు. తమిళ తెరపై ఎంజీఆర్, శివాజీ గణేశన్ తర్వాత.. ఆ స్థాయిలో అభిమానులను అలరించిన సూపర్ స్టార్. అంతే కాదు. ఇంత సుదీర్ఘమైన సినీ కేరియర్ దేశంలో మరే ఇతర స్టార్ కూ లేదేమో. మరి సినిమాల్లో ఇంతగా అలరించిన రజినీకాంత్ రాజకీయాల్లో ఏమాత్రం రాణిస్తారు.


తమిళనాడులో సినీహీరోలు రాజకీయాల్లోకి రావడం ఆనవాయితీనే. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారు ఏకంగా ముఖ్యమంత్రులై చరిత్ర సృష్టించారు. మరి వారి సరసన రజినీకాంత్ చేరతారా అన్నది తేలాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికై తమళ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన జయలలిత అనూహ్యంగా మరణించడం.. ఆ తర్వాత కరుణానిధి కూడా కన్నుమూయడం రజినీకాంత్ కు కొంతవరకూ ఉపకరించే అవకాశం ఉంది.


ప్రస్తుతం తమిళనాట రాజకీయ శూన్యత ఉంది. బలమైన నాయకుడు లేని కొరత స్పష్టంగా కనిపిస్తోంది. జయలలిత సమయంలో డమ్మీలుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల వ్యవహారం కూడా రజినీకాంత్ కు లాభిస్తుంది. ఈ రాజకీయ శూన్యతను పూరించేందుకు రజినీకాంత్ లాగానే ఉత్సాహపడే నేతలు మరికొందరు ఉన్నారు. వారిలో మరో నటుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు.

సినిమాల్లో మాదిరిగానే ఈ ఇద్దరు అగ్ర నటుడు రాజకీయాల్లోనూ పోటాపోటీగా తలపడవచ్చు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించినా.. ఇంకా పూర్తిగా పార్టీని ఆవిష్కరించలేదు. ఈ విషయంలో రజినీకాంత్ లో జోరు కనిపించడం లేదు. తమిళనాడులో ఎన్నికలకు మరో రెండున్నర, మూడేళ్ల సమయం ఉంది. ఈ సమయాన్ని రజినీకాంత్ సద్వినియోగం చేసుకుంటే తమిళనాడుకు మరో సినీనటుడు ఏలే అవకాశం లేకపోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: