హైదరాబాద్: రాష్ర్టంలో నాయకత్వ మార్పు జరుగుతుందనీ, నాల్గో క్రిష్ణుడు వస్తాడనీ అందరూ అనుకుంటున్న తరుణంలో పీఆర్పీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బాంబు పేల్చారు. తనను సీఎం కావాలనీ ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారన్నారు. చిరు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అంత ఆషామాషీగా చేసినవి కావనీ కాంగ్రెస్ నేతలంటున్నారు.
గత మూడు నెలలుగా కనిపించకుండా పోయిన చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో పత్రికలవారితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరునోటి వెంట తనను సీఎం కావాలనీ అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో ఎక్కడా కనిపించడం లేదాయన. ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటున్నారు. రాష్ర్టంలో ప్రస్తుతం పార్టీ అస్తవ్యస్తంగా తయారైందనీ, కిరణ్ పాలనపై అనేకమంది సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఎంపీలు కిరణ్ పై గుర్రుగా ఉన్నారు.
కిరణ్‌ను మార్చడంతో పాటు రాష్ర్ట మంత్రి వర్గాన్ని కూడా ప్రక్షాళన చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. చాలామంది నాయకులు రాష్ర్ట నాయకత్వాన్ని మారిస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని అధిష్టానం చెవిలో వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ బొత్స సత్తిబాబు ఢిల్లీలో ఉన్నారు. సీఎం కిరణ్ కూడా ఈరోజు మధ్యాహ్నంకల్లా ఢిల్లీకి చేరుకుంటున్నారు. రాష్ర్ట పరిస్థితులపై చర్చించడానికి కిరణ్‌ను ఢిల్లీకి పిలిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నోట వెంట వచ్చిన సీఎం కావాలనీ కోరుకుంటున్నారనేది అభిమానులా అభిప్రాయామా? లేక అధిష్టానమా ఆలోచననా? అనే దానిపై ఆసక్తికరమైన . చర్చసాగుతోంది. రకరకాల ఊహాగాలను వ్యక్తమవుతున్నాయి.
దీనికి కారణం లేకపోలేదు. గత కొన్ని నెలలుగా చడీచప్పుడూ లేకుండా ఉన్న చిరంజీవి ఒక్కసారిగా మౌనాన్ని వీడారు. అది ఢిల్లీలో. సీఎం పదవీని ప్రస్తావనకు తెచ్చారు. చిరంజీవితో కాంగ్రెస్ అధిష్టానమే వ్యూహాత్మకంగా అలా మాట్లాడించి ఉండవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కిరణ్‌ను మారిస్తే ఆయన స్థానంలో ఎవర్ని నియమిస్తే బాగుంటుందనే దానిపై అధిష్టానం కొంత కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ టైంలో కష్టకాలంలో రాష్ర్టంలో కాంగ్రెస్ సర్కాను ఆదుకున్న, సినీ గ్లామర్ ఉన్న చిరంజీవి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కాబోయే సీఎం చిరంజీవి అన్న విషయం విధితమే. అయితే, చిరు నోటి వెంట వచ్చిన వ్యాఖ్యల వెనక అధిష్టానం ప్రమేయం ఉందనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కాదు సుమా.!
మరింత సమాచారం తెలుసుకోండి: