పాకిస్తాన్ అమ్మాయిల హానీ ట్రాప్ లో భారత శాస్త్రవెత్తలు

భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బ్రహ్మోస్ కు చెందిన అత్యంత విలువైన రహస్యమైన సమాచారాన్ని పాకిస్థాన్‌ కు చేరవేస్తున్నాడం టూ ఒక సైంటిస్టును అరెస్ట్ చేయడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన సంచలన సమా చారం ఇప్పుడు బయటకు వస్తున్నది. భారత యువ శాస్త్రవేత్తలను పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ లక్ష్యంగా చేసుకుంటున్నది. 

నకిలీ సోషల్ మీడియా అకౌంట్ల తో వాళ్లను ట్రాప్ చేస్తున్నది. యువతుల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు క్రియేట్ చేసి, వాటి ద్వారా సదరు సైంటిస్టు లతో అసభ్యకరంగా చాటింగ్ చేయడం మొదలు పెడుతున్నారు. హనీ ట్రాప్‌ లో ఇదే తొలి దశ.

తర్వాత కొందరు డమ్మీ మోడల్స్‌తో సెక్స్ వీడియో కాల్స్‌ కూడా చేయిస్తున్నారు. ఇక వాళ్ల లొకేషన్ తెలియకుడా ఐఎస్‌ఐ ఏజెంట్లు తమ ఐపీ అడ్రెస్‌ లను రీరూట్ కూడా చేస్తున్నారు. ఇదే మలి దశ. దీనినే ఐపీ మాస్కింగ్ అంటారు. ఐపీ మాస్కింగ్ ద్వారా భారత అత్యాధునిక క్షిపణి వ్యవస్థ బ్రహ్మోస్ సమాచారాన్ని తెలుసుకోడానికి మరింత పకడ్బందీగా మరింత అందమైన అమ్మాయిలను ఎరవేసి హానీ ట్రాప్ ద్వారా కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. 

నాగపూర్లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌  కు చెందిన ఒక సైంటిస్టును ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేయడం దేశంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ సైంటిస్ట్ పేరే నిషాంత్ అగర్వాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఈ విషయాలన్నీ బయటకు రావడం మరింత ఆందోళనకు గురి చేస్తున్నది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్‌ తో నిషాంత్ అగర్వాల్ ను నాగ్‌పూర్‌లోని అతని ఇంట్లో అరెస్ట్ చేశారు. అతని ఇంట్లోని కంప్యూటర్లను పరిశీలిస్తే పాకిస్థాన్ అడ్రెస్‌ లతో అతను మాట్లాడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.

అధికార రహస్యాల చట్టాన్ని నిషాంత్ అగర్వాల్ పూర్తిగా ఉల్లంఘించినట్లు యూపీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన నిషాంత్ అగర్వాల్ ఉత్తరాఖండ్ వాసి. గతంలో బ్రహ్మోస్‌కు వార్‌ హెడ్‌ అమర్చే ప్రాజెక్టులోనూ నిషాంత్ అగర్వాల్ కీలక బాధ్యతలు నిర్వహించాడు. 40 మంది తో కూడిన బృందానికి నేతృత్వం వహించాడు. ఇటీవలే ఇతడికి ది యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు కూడా వచ్చింది.

అలాంటి నిఖార్సైన శాస్త్రవేత్త ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన మహిళల సోషల్ మీడియా అకౌంట్లతో అతడు చాట్ చేసినట్లు తేలిందని, ఇది హనీ ట్రాప్ కేసే అవుతుందని అధికారులు వెల్లడించారు. అధికార రహస్యాల చట్టం కింద నమోదైన ఓ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో నిషాంత్ అగర్వాల్ విచారణ సంస్థలకు చిక్కాడు. కాన్పూర్, ఆగ్రాల్లో రెండు ల్యాప్‌ టాప్స్‌ను సీజ్ చేయడంతో అందులోని సమాచారం మేరకు నిషాంత్‌ అగర్వాల్ ను పట్టుకున్నారు.

ఇలా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన అనేక కీలక రహస్యాలను చేజిక్కించుకోడానికి పాక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఐఎస్‌ఐ అమ్మాయిలు, నకిలీ వీడియోలతో భారీ కుట్రకు తెరలేపింది. భారత సైనికులు, రక్షణ వ్యవస్థ కీలక సంస్థల్లో శాస్త్రవెత్తలకు సాంకేతిక నిపుణులకు అందమైన అమ్మాయిలను ఎరవేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ యువతను సెక్స్ బానిసలుగా మారుస్తోంది. భారత్‌కు చెందిన చాలా మంది అధికారులు ఇప్పటికే ఐఎస్‌ఐ హానీ ట్రాప్‌ లో పడినట్లు సమాచారం. 

బ్రహ్మోస్‌ సంబంధించిన కీలక పరిజ్ఞానం ఇప్పటికే పాకిస్తాన్ కు చేరినట్లు తెలుస్తోంది. ఐఎస్‌ఐ ఏజెంట్లు ఈ సమాచారం మొత్తాన్ని ఒక గేమింగ్‌ కోడ్‌ సహాయంతో పాకిస్తాన్ కు చేరవేసినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఈ కోడ్‌ ను ఛేదించే పనిలో ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: