‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?

frame ‘ఓటు కు నోటు కేసు’ ఈడీ ఉచ్చు బిగిస్తుందా?

ఓటుకు నోటు కేసు ను ఒక పది పదిహేను రోజులపాటు సినిమాగా చూసిన తెలుగు ప్రజలకు ఆనేరంలో ప్రధాన భాగస్వామి ఎవరో అందరికి తెలుసు. అయినా దాన్ని మూడున్నరేళ్ళ కాలం మరుగున పడేసింది తెలంగాణా అవినీతి నిరోధక శాఖ. ఏఎ మద్య కాలంలో అప్పుడప్పుడు ఏదో కథచెపుతూ హడావిడి తప్ప ఇంతవరకు నేర్స్తులెవరని నిర్ధారించలేదు. ఇంత విచారణ అవసరం లేకుండా కూడా అసలేం జరిగిందో జనానికి తెలుసు. సరే ఒక వ్యవస్థగా తాను చెయ్యాల్సిన పని చేయటానికి అ.ని.శా కు అంత బద్ధకమేమిటో దాని నేపధ్యం ఏమిటో ఎవరూ చెప్పరు అర్ధమైనా కూడా! అయితే ఇప్పుడు ముందస్తు ఎన్నికల సమయం. ఏదో జరగబోతుందనే  ఆసక్తి పెరటానికి మరో వార్త. అదేంటో చూద్ధాం!

Image result for vote for note case latest updates
 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కష్టాలు మొదలయ్యాయి అని మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. "ఓటుకు నోటు కేసు" లో ఎన్-ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ – ఈడీ, రంగం లోకి దిగబోతోంది అన్న వార్తే అందుకు సాక్ష్యం. ఆ కేసులో ఐదుకోట్ల రూపాయల అవినీతి పై విచారణ జరిపి కేసు నిగ్గు తేల్చాలని అంటూ ఈడీతో సహా  కేంద్ర సంస్థలకు పోలీసు ఉన్నతాధికారుల నుండి లేఖ వెళ్లడం అందరికి షాకింగ్ ఇచ్చే అంశమే.

 

Image result for vote for note case latest updates

తెలంగాణ రాష్ట్రం 'ముందస్తు ఎన్నికల అంటూ రెడీ ఔతున్న సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ పోలీసు వర్గాల వార్త ప్రకారం ఓటుకు నోటు కేసులో పై ఉచ్చుబిగుస్తున్నదని, నాడు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్-సన్ తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్ధికి అనుకూలంగా ఓటువేస్తే ఐదు కోట్లరూపాయలు ముడుపులు ఇస్తామని చంద్ర బాబు స్వయంగా చెప్పటం ఆడియో టేపులలో తెలిసిందే. అందులో భాగంగా 50 లక్షల రూపాయల తో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీడియో సాక్షిగా స్టీఫెన్-సన్ ఇంట్లో పట్టుబడిన సంగతి కూడా తెలిసిందే.

 

 అయితే ఈ డీల్ లో దొరికిన 50 లక్షల రూపాయలు ఎవరివి? ఎక్కడ నుంచి వచ్చాయి? మిగతా రూ 4.5 కోట్ల రూపాయలు మాట ఏమిటి? అన్నది తేల్చటానికి ఈడీ రంగంలోకి దూకనుంది. అది కూడా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఎన్-ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తో పాటు కేంద్ర సంస్థలను కోరుతూ లేఖ రాయటం వల్ల జరుగుతున్న డెవలప్మెంట్. అయితే ఈడీ ఒక్కటేనా? లేక వేరే విచారణ ఏజెన్సీలు కూడా వస్తాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

 

ఏది ఏమైనా ఈ వ్యవహారం చంద్రబాబుకి కొత్త సమస్యలు సృష్టించే అవకాశం వుంది. విషయం తెలిసే రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసీఆర్ లు ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.

 

"ఓటు కు నోటు కేసు" వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు అంటే మూడున్నర సంవత్సరాలు అవుతున్నాకేసులో పెద్దగా పురోగతి లేదు. కానీ ఉన్నట్టు౦డి ఈడీతోపాటు మరికొన్ని కేంద్ర ఏజెన్సీలకు తెలంగాణ పోలీసు అధికారులు లేఖ రాయటం ఏమిటో? దీని వెనక రాజకీయ కోణం ఉండొచ్చేమో? అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: