ఆ సర్వేలతో గుండె గుబేల్... సెంచరీ వీరుడాయనేనా !!

frame ఆ సర్వేలతో గుండె గుబేల్... సెంచరీ వీరుడాయనేనా !!

Satya
సర్వేలు కాదు కానీ అధినేతల గుండులు గుభేల్మనే మ్యాటర్నే మోసుకొస్తున్నాయి. ముచ్చటపడి ఎలాగుంది మన పొజిషన్ అని అడిగిన పాపానికి అసలుకే ఎసరు పెట్టేలా సర్వేలు వస్తున్నాయట. దాంతో బీపీ ఓ రేంజిలో పెరిగిపోతోంది, ఏం చేద్దామన్నా ఎలక్షన్ టైం స్టార్ట్ అయిపోయిందాయే. పైగా బాగానే తేడా కొట్టేస్తోందట. 


అంతటి యాంటీనా :


చంద్రబాబు పాలనపైన ఎప్పటికపుడు సర్వేలు జరుగుతూనే ఉంటాయి. అయితే వాటిని ఫీడ్ బ్యాక్ గా చేసుకుని తమ్ముళ్ళకు క్లాస్ పీకడం ద్వారా కొంతైనా  బెటర్ గా ఉండేలా స్టెప్స్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కోవలో లేటెస్ట్ గా సర్వే చేయిస్తే మాత్రం షాక్ అయ్యే న్యూస్ వచ్చిందట. . ఈసారి అప్పొజిషన్ ఖాయమని సదరు సర్వే టీడీపీ పెద్దలకు తేల్చి చెప్పేసిందట. భారీ ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉందని ఆ సర్వే సారాంశం


అవినీతిపై శివాలే :


ఎక్కడ చూసిన అవినీతి, భూ కబ్జాలు, అక్రమాలు ఇవీ టీడీపీ పాలనలో జనం అనుభవిస్తున్న నష్టాలు, కష్టాలు, టీడీపీ తరఫున అనుకూల మీడియా చేసిన ఈ సర్వేలో వాస్తవాలు ఇలా ఒక్కోటీ బయటపడిపోతూంటే నోరు వెళ్ళబెట్టడం మినహా ఏం చేయలేని పరిస్తితి పచ్చ పార్టీ నేతలదట. ఉత్తరాంధ్ర మొదలుకుని ఉభయ గోదావరి జిల్లాల వరకు, అలాగే రాజధాని జిల్లాలతో మొదలుపెట్టి సీమ వరకూ అంతటా ఒక్కటే మాటగా ఉందిట. ఈ సర్కార్ తో పడలేం బాబోయ్  అన్నట్లుగా సర్వే జనం చెబుతున్నారట.


వైసీపీకే చాన్స్ :


ఏపీలో ఎపుడు ఎన్నికలు పెట్టినా వైసీపీకే చాన్స్ ఉందని సర్వేలు చెబుతున్నాయని తేలుతోంది. కనీసం వందకు తక్కువ కాకుండా సీట్లు జగన్ పార్టీకి వస్తాయని ఏకంగా టీడీపీ అనుకూల మీడియా చేసిన సర్వేలే చెబుతూంటే హై కమాండ్ హడలెత్తిపోతోంది. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు కూడా టైం లేదని పసుపు శిబిరం తల్లడిల్లుతోంది. ఇసుక, భూ కుంభకోణాలతో పల్లే జనం తల్లడిల్లిపోతే, ప్రత్యేక హోదాతో పాటు ఏ హామీ అమలు కాకపోవడం, డెవలప్మెంట్ ఎక్కడా లేకపోవడంపై పట్నం వాసులు యాంటీగా ఉన్నారట.


.పచ్చ మీడియా సర్వేలే ఇలా నిజం చెబితే బయట వాతావరణం ఎంత భయంకరంగా ఉందోనని టీడీపీ అధినాయకత్వంలో వణుకు పుడుతోందట. మొత్తంగా చూసుకుంటే వచ్చే ఎన్నికలు అధికార టీడీపీకి దబిడి దిబిడేనని చెప్పకనే చెబుతున్నాయట


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: