క్రూరమృగమ్ముల కోరలు చీల్చెను, ఘోరారణ్యములాక్రమించెను,
హిమాలయముపై జండా పాతెను, ఆకాశంలో షికారుచేసెను,
అయినా మనిషి మారలేదు,ఆతని కాంక్ష తీరలేదు.
న్యూస్ లో సాంగేమిటి అని అనుకుంటున్నారా, కాదా మరి మనిషి మనసు గూర్చి మనసున్న కవి కలం నుంచి జాలువారిన నాలుగు మాటలు అప్పుడప్పుడు మననం చేసుకోవాలంటారు.ఎందుకంటే అవి ఒక్కోసారి నిజజీవితంలో కూడా సాక్షాత్కరిస్తాయి. ఎలగంటారా ...అయితే ఇది చదవండి:
కష్టము చేసెను,కీర్తి గడించెను,
డబ్బును పొందెను, మెగాస్టార్ అయ్యెను,
అయినా అతను మారలేదు, ఆతని కాంక్షతీరలేదు.
వేషము తీసెను,భాషను మార్చెను,
పార్టి పెట్టెను,వేదికలెక్కెను,
వాదము చేసెను, ప్రతినిధుల సభలో అడుగును పెట్టెను,
అయినా అతను మారలేదు,ఆతని కాంక్ష తీరలేదు.
మెగాపదవిపై కన్ను వేసెను,పెట్టిన పార్టిని పాతరపెట్టెను,
అయినా పదవి దక్కలేదు, ఆతని కాంక్ష తీరలేదు.
అయినా చిరంజీవి మాత్రం పాడుతున్నపాట వేరే ఉందట, అదే ఇది...
అనుకున్నామని అయిపోవన్ని,అనుకోలేదని ఆగవుకొన్ని,
జరిగేవన్ని మంచికని, అనుకోవటమే మనిషి పని....
ఎందుకంటే ఆయన బావమరిది అల్లు అరవిందే కదా ఆయనను నడిపిస్తుంది.మరి ఆయనది గీతాఆర్ట్స్ మూవీస్. మరి గీతలో ఏముంది, మనకు దక్కాల్సింది దక్కుతుంది. దక్కనిదాని కోసం ఎంత కష్టపడ్డా దక్కదని. అందుకే చిరు ఇప్పుడు మౌనంగా ఉన్నారట.
నెక్ష్ట్ వాట్...వెయిట్ అండ్ సీ.
మరింత సమాచారం తెలుసుకోండి: