మూడు కోట్లు ఆఫర్ వద్దన్నారు..అంతే రాక్షసుడయ్యాడు!

frame మూడు కోట్లు ఆఫర్ వద్దన్నారు..అంతే రాక్షసుడయ్యాడు!

Edari Rama Krishna
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిన్న నింధితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్.  అయితే ఇది కేవలం ఇంటర్ క్యాస్ట్ విషయమే కాదని..తన ఇగో దెబ్బతీసే విధంగా ప్రణయ్ కుటుంబ సభ్యులు...ప్రణయ్ ప్రవర్తించారని..అందుకే ఈ దారుణానికి పాల్పడినట్లు అమృత తండ్రి తిరుపతి రావు అంటున్నారు.  చిన్న నాటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమార్తె అమృత వర్షిణిని ఎలాగైనా తమ వద్దకు రప్పించుకోవాలన్న భావనలో ఉన్న మారుతిరావు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కొనసాగించారు.

బెదిరించాడు,  ఎటాక్ చేయించాడు..బుజ్జగించాడు..అయినే ప్రణయ్ మాత్రం తన ప్రేమను వదిలే సమస్యే లేదని అంటూ వచ్చాడు.  అయితే ప్రణయ్ హత్యకు ముందు..తన కుమార్తె అమృత వర్షిణిని ఎలాగైనా తమ వద్దకు రప్పించుకోవాలని  మారుతీరావు, హత్యకు ప్లాన్ చేసే ముందు ప్రణయ్ కుటుంబానికి రూ. 3 కోట్ల ఆఫర్ ఇచ్చాడు. అమృతను ఒప్పించి ఇంటికి తిరిగి పంపిస్తే చాలని, అందుకు ప్రతిగా మూడు కోట్లు ఇస్తానని మారుతీరావు చెప్పాడని నల్గొండ ఎస్పీ వెల్లడించారు. 

అయితే మారుతిరావు ఇచ్చిన ఆఫర్ మరోసారి ప్రణయ్ కుటుంబం కాదని చెప్పడంతో..ఆయనలోని రాక్షస కోణం బయటకు వచ్చింది.. మూడు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డ తాను, అందులో ఓ కోటి రూపాయలైనా ఖర్చుచేసి ప్రణయ్ ని తప్పిస్తే సరిపోతుందని భావించాడని, అలా చేస్తే అమృత తిరిగి తన ఇంటికే వస్తుందన్న అలోచనే, మారుతీరావును మృగంగా మార్చిందని అన్నారు.  ఓ భూ వివాదంలో గతంలో తనను కిడ్నాప్ చేసిన బారీ, అస్గర్ లతోనే ప్రణయ్ ని చంపించే డీల్ కుదుర్చుకున్నారని ఎస్పీ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: