'వరదల్లో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఈ తిరుగుళ్ళు ఏమిటి రమ్యా?' నెటిజెన్స్ ట్రోలింగ్

కన్నడనటి అయిన తరవాత రమ్య గా పిలవబడే 36యేళ్ళ దివ్యస్పందన మాంద్య నియోజకవరగం నుండి లోక్-సభకు ఎన్నికై, త్వరత్వరగా వైకుంఠటపాళిలో నిచ్చెనలు ఎక్కేశారు. కానీ, 2014 ఎన్నికల్లో ఓటమితో "కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమానికి జాతీయ అధినేత" గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియాలో రాహుల్ గాంధికి ప్రతిష్టను సృష్టించటమేకాదు ఆయన దశదిశను మార్చిన అతి సన్నిహితురాలని కూడా కాంగ్రెస్ పెద్దలు అంటారు  

ఇప్పుడు ఆమె నెటిజెన్స్ కు లక్ష్యంగా మారింది కారణం కేరళ రాష్ట్రాన్ని భారీవర్షాలు, ధారుణ వరదలు మన్నూ మిన్నూ ఏకం చేసి ముంచెత్తాయి. ఒక్క కేరళను మాత్రమే కాదు రమ్య స్వంత రాష్ట్రం కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా వరదల కారణంగా జలదిగ్భందనమయ్యాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు ఆపై వరదలు తగ్గుముఖం పడు తుండటం తో, అక్కడి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. 

ఇంతకీ అసలు విషయం ఏమంటే, కాంగ్రెస్ నేతగా పార్టీకి సంబంధించిన అని విషయాల్లో రమ్య చురుకుగా వ్యవహరిస్తుంటారు. కాగా, గత కొంత కాలంగా అదీ రాష్ట్రం ప్రకృతి విపత్తు లో విలవిలలాడే సమయంలో ఆమె జాడ ఎవరికి కనిపించడం లేదు, అంతర్జాలంలో అంతకంటే ఆమె ఉనికే లేకుండా పోయింది. తన సొంత రాష్ట్రం కర్ణాటక వర్షాలు వరదలతో బీభత్సం అయిపోతుంటే, ఆమె ఆ దరిదాపుల్లోనే లేకుండా, బాధితులను పరామర్శించకుండా దేశం నుండి మాయమైన సమయంలో సడన్ గా రమ్యకు సంబంధించిన ఒక ఫొటో సోషల్‌ మీడియా లో ట్రోల్ అయి ఇప్పుడు వైరల్‌ గా మారింది.

అయితే కొద్ది కాలంగా కనిపించని నటి,  కాంగ్రెస్ నేత రమ్య ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు జర్మనీ పర్యటనలో విశేషంగా కనిపించడం కన్నడ జనానికి ఆగ్రహం తెప్పించింది. జాతి విలయంలో విలవిలలాడుతుంటే ఈమె విదేశాల్లో రాహుల్ తో చేసేదేమిటంట?  అంటూ కాస్త కటువుగానే వాయించేస్తున్నారు. 
ఆమెతో పాటు కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దియోరా,  కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జిలలో ఒకటైన మధుయాష్కి గౌడ్ తో కలిసి తీయించుకున్న ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

రాష్ట్రంలోని ప్రత్యేకించి కొడగు జిల్లా భారీవర్షాలు, వరదలతో అట్టుడికిపోయి, ప్రజలు హాహాకారాలు చేస్తుంటే, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రమ్యకు విదేశాలకు వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది?  ఇదేనా వీరి ప్రజాసేవ అని కొందరు తలంటితే, మరికొందరు నెటిజన్లు చురకలంటిస్తూనే ఉన్నారు.  బహుశ ఈమే విలాస వినోద విహారం గమనించి కన్నడిగులకు కడుపు మండి ఉండొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: