కొనసాగుతున్న టిఆర్ఎస్ నిరసనలు

Kuthuru RajiReddy
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను టిఆర్ఎస్ ఆధ్వర్యంలో దగ్దం చేస్తున్నారు. వ్యవసాయానికి ఏడుగంటల పాటు విద్యుత్ ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ విధ్యుత్ సౌధ ముందు ధర్నా చేస్తున్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమను అమానుషంగా అరెస్టు చేస్తున్నారని అరెస్టు కాబడిన పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాగా వారి అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేయాలని టిఆర్ఎస్ వి పిలుపునివ్వడంతో ఇప్పటికే పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తున్నారు. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, నల్గొండ తదితర తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివిధ విధ్యుత్ సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ఆందోళనకు దిగారు . వ్యవసాయానికి 7గంటల పాటు విధ్యుత్ ను సరఫరా చేస్తామని సిఎం స్పష్టమైన హామీనిస్తే తమ దీక్షను విరమిస్తామని అరెస్టు కాబడిన పలువురు ఎమ్మెల్యేలు ఆయా పోలీస్ స్టేషన్ల లో దీక్షలకు దిగారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాగా 6 గంటల పాటు విధ్యుత్ సౌధవద్ద టిఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ట్రాన్స్ కో ఎండీ చాంబర్ వద్ద ఆందోళనకు దిగగా వారిని మంగళవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు.  చివరగా 7గంటల పాటు వ్యవసాయానికి విధ్యుత్ ను సరఫరా చేయాలనే డిమాండ్ తో చేపట్టిన ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి శంకర్ రావు మద్దతు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: