కేరళ రాష్ట్రం గురించి తన ఆవేదన వ్యక్తం చేసిన జగన్..!

KSK
ఎడతెరిపిలేని వర్షం కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఈ క్రమంలో ద్వారా రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం చాలామంది సినీ స్టార్లు అలాగే దేశంలో ఉన్న వివిధ పార్టీ రాజకీయ నాయకులు తమ విచారాన్ని సహాయాన్ని వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ కేరళ రాష్ట్రంలో వరద ఉధృతిని గురించి అలాగే అక్కడి ప్రజలను గురించి తన ట్విట్టర్ ఎకౌంట్లో సంచలన కామెంట్ చేశారు.


పాదయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలో ఇటీవల అడుగుపెట్టిన జగన్ కేరళ రాష్ట్రంలో ప్రకృతి చేసిన ఘోరాన్ని చూసి తన విచారాన్ని వ్యక్తం చేశారు. కేరళలో వరద భీభత్సం చూస్తుంటే హృదయం కలచివేస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.


ఈ కష్ట కాలంలో తనప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయన్నారు. విపత్తుతో తల్లడిల్లుతున్న కేరళ ప్రజలకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్రప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు. భారీ వర్షాలు, వరదలతో కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.


మరోపక్క కుండపోత వర్షం మాత్రం ఆగడం లేదు..పరిస్థితి ఇలానే ఉంటే కేరళ రాష్ట్ర ప్రజలు చాలా దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు వాతావరణ నిపుణులు. మరోపక్క దేశప్రజలందరూ కేరళ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని ప్రార్థనలు చేయాలని తమతమ దేవుళ్లకు మొక్కు కోవాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రార్థిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: