లోక్-సభలో టిడిపి "అవిశ్వాసం అతి పేలవం"- సినిమా కథ చెప్పారు

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై  నేడు ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ చర్చను దేశమంతా ఆసక్తి గా ఎదురు చూస్తోంది. అయితే అవిశ్వాసం కారణంగా బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమైతే లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 



భరత్ అనే నేను సినిమా ప్రస్థావన తో టిడిపి అతి ముఖ్యమైన విషయమైన ప్రత్యేక హోదా ప్రక్కనబెట్టేసి తన ఉపన్యాసాన్ని "సినీ వినోదానికి సమం చేశారు" గల్ల జయదేవ్. ప్రస్థావనలు అన్నీ పేలవంగా ఉన్నాయి. 


నాలుగు కారణాలతో తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టామని పేర్కొన్న గల్లా జయదేవ్ 


పారదర్శకత: రాష్ట్ర విభజన పారదర్శకంగా జరగలేదని, 

నమ్మకం: న్యాయం చేసే విషయంలో ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారని, 

ప్రాధాన్యత: నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వలేదని దుయ్యబట్టారు   

మాట నిలబెట్టుకోవడం: పలు విభజన హామీలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని చెప్పారు.  


పై నాలుగు అంశాలపై తమకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం లోని ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని ఉద్ఘాటించారు. తాను 5 కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తరఫున మాట్లాడుతున్నానని అన్నారు.



తెలంగాణలో ఉన్న ఎన్నో విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలున్నాయని, పాత పేరుతో కొత్తగా పుట్టిన ఆంధ్రప్రదేశ్‌ లో అవి లేవని చెప్పారు. పార్లమెంట్ తలుపులు మూసేసి, నిర్దయగా విభజించారని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు జయదేవ్‌ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, సభాపతి, సుమిత్రా మహాజన్ వారించారు. అలాగే టీఆర్ఎస్ సభ్యులు కూడా కాంగ్రెస్ ఎంపీలకు మద్దతు పలకడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో పూర్తిగా స్పష్టంగా తెలంగాణా రాష్ట్ర సమితి సానుభూతిని పోగొట్టేశారు జయదేవ్.



విభజన వల్ల తెలంగాణకు కలిగిన ప్రయోజనం, ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం, కేంద్రప్రభుత్వ ద్రోహం గురించి ఆయన పలు అంశాలను లేవనెత్తారు. ఈ క్రమంలో టీడీపీకి ఇచ్చిన సమయం ఎప్పుడో అయిపోయింది. అయినా సరే గల్లా జయదేవ్ ప్రసంగం మాత్రం అనర్ఘళంగా మనం రోజూ చంద్రబాబు వినిపించే సొదే కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ కలగజేసుకుని ఇంకా ఎంతసేపు మాట్లాడతారని ప్రశ్నించారు. ఇంకెంత సమయం కావాలని అడిగారు. దీనికి సమాధానంగా, ఇది చాలా కీలకమైన సమావేశమని, తాము చెప్పుకోవాల్సింది చాలా ఉందని, అన్నీ వివరించడానికి తనకు మరో గంట కేటాయించాలని అన్నారు.


"అంత సమయం ఇవ్వడం కుదరదు. ఐదు నిమిషాల సమయం మాత్రమే" ఇస్తానని స్పీకర్ చెప్పారు. దీనికి సమాధానంగా, అవిశ్వాసంపై తీర్మానానికి సంబంధించి గంట కన్నా తక్కువ సయమంలో తమ సమస్యలను చెప్పుకోవడం కుదరదని గల్లా సమాధానం చెప్పారు. మొత్తం మీద 13 నిమిషాలు సమయం పొందిన టిడిపి,  వారు కోరిన  దాదాపు గంటకు పైగా మాట్లాడినా సమర్ధవంతంగా తమ అవిశ్వాసానికి సరైన సమర్ధవంత మైన సకారాత్మక భాషణ చేయలేక పోయింది. ఈ అవకాశం కేసినేని నానికి గాని రామ్మోహన నాయుడికే మొదటే ఇచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది. 



కేంద్రంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నన్నారని జయదేవ్ పార్లమెంటులో విరుచుకుపడ్డారని ఘనంగా చెప్పలేము. కారణం చెప్పిందంతా మనం రోజూ వినేదే. చివరకు ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండాల్సి న పారదర్శక సంబంధాలను నరెంద్ర మోదీ తీవ్రంగా దెబ్బతీశారని ఆయన్ను మోసగాడు గా అభివర్ణించారు జయదేవ్.  దాంతో నిర్మలా సీతారామన్ ఆ విషయాన్ని రికార్డుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: