బ్రేకింగ్ - ఏపీలో మహా కూటమి..సీఎం గా అభ్యర్ధి పవన్ కళ్యాణ్.

Bhavannarayana Nch

రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా  జరగచ్చు అంటారు..వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒక మహా కూటమి రాబోతోందని  ఆ కూటమిని దగ్గర ఉండి నడిపించే సత్తా కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని..అందుకే ఆ కూటమికి సారధ్యం వహించి సీఎం అభ్యర్ధిగా పవన్  ఉండాలని కోరుకుంటున్నాం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.. కర్నూల్ జిల్లా ఆలూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అఆదివారం విలేఖరులతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై కూడా కామెంట్స్ చేశారు..

 

పవన్ కళ్యాణ్ కి ప్రజలలో బాగా క్రేజ్ ఉందని క్లీన్ ఇమేజ్ ఉందని రెండూ ఉన్న నాయకుడు దొరకరం చాలా అరుదని అందుకే అలాంటి లక్షణాలు ఉన్న నేత సీఎం అభ్యర్ధిగా ఉంటే పూర్తి  న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్నామని ఆయన తెలిపారు..గాలి జనార్దన్‌ రెడ్డి తనకు రెండేళ్ల సమయం ఇస్తే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి 85 శాతం నిధులు కేంద్రం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం సిగ్గుచేటని అన్నారు..అయితే బీజేపీతో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పొత్తులు పెట్టుకుంటే ఆ పార్టీలకు ప్రజలే బుద్ధిచెబుతారని రామకృష్ణ వ్యాఖ్యానించారని

 

అయితే సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలకి ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులకి పూర్తి వ్యత్యాసం ఉంది..ఏపీలో మహా  కూటమి రావాలి అదేసమయంలో పవన్ సీఎం అభ్యర్ధి అవ్వాలంటే తప్పకుండా ఏపీ ప్రధాన పార్టీలు అయిన తెలుగుదేశం, వైసీపిలు ఆ కూటమిలో ఉండవు అయితే మిగిలింది ఏపీలో ఇక సీపీఐ ,సీపీఎం, జనసేన,బీజేపీ పార్టీలు మాత్రమే అయితే జగన్ కి బీజేపి బాసటగా ఉంది కూటమిలో కలిసే అవకాశం కూడా లేనట్టేనని చెప్పాలి    ఇక ఆ సమయంలో పుట్టుకు వస్తే ఒకటో రెండో పార్టీలు..ఒక వేళ జేడీ గనుకా పార్టీ ని ప్రారంభిస్తే జేడీ కూడా కలిసే అవకాశం ఉంటుంది..

 

 అయితే ఇప్పటికే వామపక్ష పార్టీలకి ఏపీలో ఎలాగో అంత సీన్ లేదు..జనసేన ఓట్లని చీల్చగలదు తప్ప అధికారమా చేజిక్కించుకునే అవకాశం లేదు..మరి అలాంటప్పుడు త్వరలో ఏర్పడే మహా కూటమిని ఏవిధంగా ఏర్పాటు చేస్తారు అనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది..ఒక వేళ బీజేపి ని కూటమిలో కలపాలని చూసినా వామపక్షాలు బీజేపి చేరికకి విరుద్దం మరి అలాంటప్పుడు ఏ కోణంలో రామకృష్ణ ఈ ప్రకటన చేశారో అర్హ్తం కాక జుట్లు పీక్కుంటున్నారు నేతలు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: