చంద్రబాబు జిల్లాలో ప్రశ్నల వర్షం కురిపించిన పవన్..!

Vasishta

సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో జనసేనాని సందడి చేశారు. 5 రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న ఆయన..  పవన్ దూకుడు పెంచారు. 5 రోజులుగా  జిల్లాలో పర్యటిస్తున్న పవన్... భూ నిర్వాసితుల సమస్యలపై ఫోకస్ పెట్టారు. మంగళవారం చిత్తూరు ఈరోడ్ బిల్డింగ్ ఓనర్స్ అసోషియేషన్ బాధితుల పక్షాన పోరాటం సాగించిన పవన్.. ఇవాళ తిరుపతి సమీపంలోని శెట్టిపల్లి రైతులకు అండగా నిలిచారు.


ప్రజలకు అన్యాయం చేస్తే జనసేన సహించదని, పేదల భూముల జోలికొస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు పవన్. రైతులకు చంద్రబాబు అమలు చేసిన రుణమాఫీ మూడు చెంచాల తీర్థం పోసినట్లుగా ఉందని విమర్శించారు. చిత్తశుద్ధితో అమలు చేయలేనపుడు హామీలు ఇవ్వడం దేనికని ఆయన ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగేంతవరకూ జనసేన పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అవసరానికి మించి రైతుల నుంచి భూములు తీసుకోవడాన్ని, శెట్టిపల్లి ప్రజల భూములు లాక్కోవడాన్ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.


మంగళవారం చిత్తూరులోని  ఈరోడ్ బిల్డింగ్ వెల్ఫేర్‌ అసోసియేషన్ సమస్యలపైనా ప్రభుత్వంతో  పోరాడుతానన్నారు పవన్. గిరింపేట నుంచి జిల్లా కోర్టు సముదాయం వరకు రోడ్డు విస్తరణ చేపడితే 360 మంది ఇళ్లు కోల్పోతారన్న పవన్.. విజయనగరం, నంద్యాల, శ్రీకాళహస్తిలో రోడ్డు విస్తరణ సమయంలో బాధితులకు పరిహారం ఇచ్చినట్టే ఇక్కడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.


త్వరలో రాష్ర్టవ్యాప్త పర్యటనకు సిద్ధమౌతున్న పవన్.. అంతకుముందే సీఎం సొంతజిల్లాలో భూ నిర్వాసితుల సమస్యలపై ఫోకస్ పెట్టడం చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్న పవన్.. చిత్తూరు జిల్లా నుంచే అది మొదలు పెట్టారని ..13 జిల్లాలోనూ భూముల దందాపైన పవన్ పోరాడుతారని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. అన్యాయం ఎక్కడుంటే అక్కడకు పవన్  వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు జనసేన కార్యకర్తలు. మరి పవన్ పోరాటం ఎక్కడిదాకా వెళ్తుందో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: