పార్లమెంట్ లో కాపాడి తిరుపతి లో ఎడుస్తున్న చంద్రబాబు

KSK
అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాల్సిన చంద్రబాబు అనేక కేసుల్లో ఇరుక్కుని కేంద్రం దగ్గర రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు. పార్లమెంటు సాక్షిగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను ప్రధాని మోడీ తో పాటు చంద్రబాబు కూడా  మోసం చేశారు.

అయితే ఈ క్రమంలో ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుండి ఒకే మాట మీద ఉండటంతో ప్రజలు ప్రత్యేక హోదా వల్ల లాభాలేంటో తెలుసుకోగలిగారు. ప్రతిపక్షనేత ప్రజలు ఒకే మాట మీద ఉండటంతో... ప్రత్యేకహోదా ఏమైనా సంజీవన్న..అన్న చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని...కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని యుటర్న్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా గత ఎన్నికలలో తిరిపతి సాక్షిగా మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పడం జరిగింది...అయితే మోడీ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి మోసం చేయడంతో..చంద్రబాబు తాజాగా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై మోడీ అనుసరించిన వైఖరిని ఎండగట్టారు. అలాగే రాష్ట్రానికి జీవనాడి ప్రాజెక్టయినా పోలవరం విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరిపై కూడా మండిపడ్డారు.

తాజాగా మోడీ పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రజలలో అలాగే రాజకీయాలలో తీవ్ర అసహనం నెలకొంటుంది. చంద్రబాబు ప్రస్తుతం తిడుతున్న మోడి ప్రభుత్వంపై ఇటీవల పార్లమెంటులో వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఎందుకు మద్దతు తెలపకుండా ఇక్కడ ముసలి కన్నీరు కారుస్తున్నారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నరు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: