పసి పిల్లలపై లైంగిక నేఱాలకు మరణ శిక్ష: కేంద్ర కాబినెట్ ఆర్డినెన్స్‌

భారతదేశం మహిళలపై లైంగిక నేఱాలతో అట్టుడికి పోతోంది. కశ్మీర్ నుండి కన్యాకుమారివరకు రాష్ట్రం నగరం పట్టణం గ్రామం ప్రాంత మత కుల వయోభేధం లేకుండా ఆడదైతే చాలు పొత్తిళ్ళలో బిడ్డైనా కాటికి కాలుజాపిన ముదుసలైనా తేడా లేకుండా లైంగిక అత్యాచారానికి గురి చేస్తు  ఉన్నారు. చివరకు ప్రధాని నరెంద్ర మోదీకి ఐఖ్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి సైతం సలహా ఇచ్చారని వార్తలు వచ్చాయి. అందుకే ప్రధాని నేడు దీని విషయమై చట్టం చేయాలని నిర్ణయించారు. 


12ఏళ్ల లోపు వయస్సున్న చిన్నారులపై లైంగిక అత్యాచారానికి పాల్పడే వారికి మరణ దండన విధించేలా కేంద్రం అత్యవసరంగా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం లో అత్యవసరం సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కథువా, ఉన్నావ్‌ అత్యాచార హత్యాచార ఘటనలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోన్న వేళ "పోక్సో" చట్టానికి కోరలు, కొమ్ములు, గోళ్ళు వచ్చేలా  సవరణలు చేయాలని నిర్ణయించింది. 

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టం కింద కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదును విధించే అవకాశం ఉంది. లైంగిక చర్య తర్వాత బాధితురాలు మృతి చెందినా, అచేతనంగా మారినా ముద్దాయికి మరణ దండన విధించేలా పోక్సో చట్టంలో నిబంధనలు మార్చనున్నారు. వర్షాకాల సమావేశా ల్లో ఈ మేరకు పార్లమెంట్‌ లో బిల్లు పెట్టాల ని కేంద్రం భావిస్తోంది. అప్పటివరకూ అమలులో ఉండేలా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. 

12ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి నేఱ తీవ్రత మేరకు మరణ దండన విధించేలా శిక్షాస్మృతి లో మార్పులు చేసేందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆలోచిస్తున్నట్లు ఒక కేసుకు సంబంధించి నిన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం తెలిపింది. పోక్సో చట్టానికి సంబంధించిన పూర్తి సవరణలపై చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ అత్యవసర ఆర్డినెన్స్‌ను ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించే అవకాశం ఉంది.

"లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం - పోక్సో- అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్‌ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ - 2012 ప్రభుత్వం రూపొందించి 2012, నవంబర్ 14 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం దేశమంతటికీ 18సంవత్సరాల లోపు వయసున్న బాలురు/బాలికలు అందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: