ఎమెల్యేలు, ఎంపీలపై దేశ వ్యాప్తంగా క్రిమినల్ కేసులు: సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వ నివేదిక


భారత్ లో ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు అనేక నేరారోపణలతో మగ్గిపోతున్నారు. వీళ్ళ నేరాలకు పార్టీలు, ప్రాంతాలు, మతాలు, కులాలు, లింగ బేధం లేకుండా నేరాలు చేసేస్తూ రాజాకీయాల క్రీనీడల్లో విలాస జీవితం గడిపేస్తున్నారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం దీనిపై ఫోకస్ పెట్టినట్లుంది.  ప్రజా సేవ చేస్తామని అంటూ రాజకీయ క్షేత్రంలో ఉన్న దాదాపు 1700 మంది పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులపై అనెక నేరారోపణలు ఉన్నాయి. వీరంతా దాదాపు 3,045 క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కు వివరణ ఇచ్చింది.

కాగా, కేసులు ఎదుర్కొంటున్న వారిలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుంచే ఎక్కువమంది ఉన్నారని, ఆ తర్వాత తమిళనాడు, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ వరుసగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌ లో 248 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమిళనాడు, బిహార్‌, బెంగాల్‌లో వరుసగా 178, 144, 139 మంది ఎమ్మెల్యే లు విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో 100 మందికిపైగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కూడా వివిధ నేరాల్లో పాలుపంచు కున్నట్లు, స్వయంగా చేసినట్లు కేసులు ఉన్నాయి.

మన ముందు అందరూ తమ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడతారు గాని, లోపల వీళ్ళంతా ఒకటే. ప్రజాసేవ కాకరకాయ అంటూ పరమ చెత మాట్లాడుతూ ఉంటారు. ఇకనైనా నిజమైన ప్రజాసేవకులే ప్రజాపాలనలో ఉండెలాంటి వాతావరణం రావాలని న్యాయస్థానాలను ప్రజలంతా ముక్త కంఠం]తో ప్రార్ధిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: