దుర్గ గుడిలోకి మందు, మద్యం - భయంకరమైన నిజాలు..

Chakravarthi Kalyan
విజయవాడు దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయన్న ఆరోపణల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు, దేవాదాయశాఖ అధికారులు ఇచ్చిన విచారణ నివేదకలు చూస్తే కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. అమ్మవారి అనుగ్రహం కోసమో.. తాంత్రిక పూజల కోసమో కానీ... దుర్గ గుళ్లో చాలా అపచారాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి. డిసెంబరు 26 తేదీ రాత్రి జరిగిన పూజలను సాక్షాత్తూ ఈవో సూర్యకుమారే చేయించినట్టు నివేదికలు చెబుతున్నాయి. 



ఆ విస్తుగొలిపే వాస్తవాలు ఏంటో చూద్దాం.. అంతరాలయంలోని అమ్మవారి మూలవిరాట్టుకు మహిషాసుర మర్ధిని అలంకారం చేయించి పూజలు జరిపారట. అంతకు ముందు అలంకారం కోసం అమ్మవారికి ఉండే కవచాలను తీసేశారట. అంతే కాదు.. ఆలయంలోకి పూజల కోసం మాంసం, మద్యం తీసుకెళ్లారు.. వాటితో అమ్మావారిని పూజించి నైవేద్యంగా ఆ తర్వాత ఆరగించారట.  తాంత్రిక పూజల సమయంలో ఆ తంతును ఫోటో కూడా తీశారట. 



అంతే కాదు.. ఆ పూజలు జరిగిన సమయంలో అర్చకులు ఈవోతో ఫోన్లో మాట్లాడారట కూడా. అంతా ఈవో సూర్యకుమారి చెప్పినట్టుగానే తాము చేశామని అర్చకులు చెప్పారట. ఇలా పూజల విషయంలో తాను చెప్పినట్టు చేసినందుకు.. ప్రధానార్చకుడి బంధువుకు ఉద్యోగం ఇప్పించేందుకు ఈవో సూర్యకుమారి ఆశచూపించినట్టు విచారణ నివేదిక చెబుతోంది. 
అమ్మవారి మూలవిరాట్ కు తాంత్రిక పూజలు చేసిన తర్వాత.. అర్చకులు ఆర్టీసీ బస్టాండు లోని డార్మిటరీలో పడుకున్నారట.


అక్కడే నైవేద్యంగా పెట్టిన మాంసాన్ని, మద్యాన్ని తిన్నారట. తెల్లవారిన తర్వాత అక్కడే ఉన్న ఓ ముష్టి వానికి మిగిలిన మాంసం ఇచ్చారట కూడా. ఐతే.. ఈవో పూజల ఫోటోను ఎవరి కోసం తీయమనిచెప్పారు. అసలు పూజలను ఫోటో తీశారా లేదా.. ఆ ఫోటోను ఎవరికి పంపారు.. ఈ తంతు వెనుక ఇంకెవరైనా ఉన్నారా.. అన్న విషయాలు తేలాల్సి ఉంది. అందుకే ఇంకా పూర్తి సమాచారం కోసం మరింత లోతుగా విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ఈవో సూర్యకుమారిని మాత్రం వెంటనే ఆ పదవి నుంచి తొలగించేసారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: