నటి చార్మికి డ్రగ్స్-కేసులో అకున్ సబర్వాల్ సమాదానం





డ్రగ్స్ కేసు సినిమా వాళ్ళ మెడకు చుట్టేస్తున్నారనే వాదనకు కొంత అర్ధమున్నా సామాజిక ప్రయోజనం కూడా ఉంది. సినీ తారలు అనగానే, వారి పై వచ్చే వార్తలకు ప్రజలు ఆకర్షితులవటం సహజం. అయితే వారినుంచి వినోదం ఒక సామాజిక ప్రయోజనమైతే, ఇలాంటి నేఱాల తదుపరి ప్రభావం ఎలా ఉంటుందనేది జనవాహినిలోకి అతి త్వరగా చేరిపోతుంది కూడా. సామాజికంగా అత్యంత అభిమాన గణాలను పోగేసుకునే ఈ సినీ సెలబ్రిటీల నుండి వారి అనుచరులకు కూడా గుణపాఠం అందుతుంది. 



డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎంఫొర్సుమెంట్ అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అటు రాం గోపాల్ వర్మ ను ఉద్దే సించి కేసు దర్యాప్తు చట్టబద్దంగా సాగుతుందని కొంతమందికి అవగాహన లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారంటూ ఇటు చార్మీని అన్యాపదేశంగా ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అకున్ సబర్వాల్. 


డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి చార్మి ఈరోజు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ను ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేసింది. ఇందులో "సిట్ అధికారుల విచారణ చట్టబద్ధంగా జరగటం లేదని, బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈనెల 26న సిట్ విచారణకు హాజరౌతున్న తనను విచారణ చేస్తున్న సమయంలో న్యాయవాదిని కూడా అనుమతించాలని" చార్మి న్యాయ స్థానాన్ని పిటిషన్లో కోరారు. తనకు ఇంకా పెళ్లి కానందున రక్త నమూనాలను సేకరించడం చట్ట విరుద్ధం అంటూ, సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలను సిట్ అధికారులు పాటించడం లేదని, విచారణ సందర్భంగా బలవంతంగా రక్త నమునాలు సేకరించడం చట్టవిరుద్ధమంటూ ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. 




ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా శాంపిల్స్ సేకరించరాదని, తనను విచారించడానికి మహిళా అధికారిని నియ మించాలంటూ చార్మి తరుపు లాయర్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన్ని ఆ పిటీషన్ ద్వారా అబ్భ్యర్దించారు.  అయితే చార్మి పిటిషన్లో పేర్కొన్న అంశాలపై పూర్తిగా వివరించారు అకున్ సబర్వాల్. చాలా మంది ఆరోపిస్తున్నట్టు తాము ఎక్కడా సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలను అధిగమించట్లేదని వాటికి లోబడే అ పరిధి లోపలే దర్యప్తు జరుగుతుందని చెపుతూ అనవసర అపోహలు తమకు వద్దని అలాగే ప్రజలకు ఆ సందేశం వద్దన్నారు. సిట్ విచారణ మొత్తం ఎలా జరుగుంతుందని రికార్డ్ చేస్తున్నామని వాటిని కోర్టుకు సమర్పిస్తామన్నారు. 




విచారణ హాజరైన వారినుండి బలవంతంగా శాంపిల్స్ తీసుకుంటున్నామనటంలో నిజంలేదని, వారు రాత పూర్వకంగా అనుమతించాకే శాంపిల్స్ సేకరిస్తున్నామని, ఒకవేళ వారికి రక్తనమూనాలు ఇవ్వడం ఇష్టంలేకపోతే దానినే రికార్డ్ చేస్తామని, అంతే తప్ప బలవంతంగా నమూనాలు సేకరించే ప్రశక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ డ్రగ్స్ కేసులో మహిళలను విచారించ డానికి మహిళా అధికారి ఉన్నారని  నార్కోటిక్స్, నిఘా, లీగల్ బృందాలతో కలిపి విచారణను ముందుకు తీసుకువెళుతు న్నామని విచారణ మొత్తం చట్టపరంగానే, చట్టం అనుమతించిన పరిధికి లోబడే సాగుతుందని అకున్ సబర్వాల్ క్లియర్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: