కాశ్మీర్ సమస్యకు మోదీ సర్కార్ శాశ్వత పరిష్కారం..!?

Chakravarthi Kalyan
కాశ్మీర్ సమస్య.. భారత్ - పాకిస్థాన్ మధ్య రగులుతున్న రావణ కాష్టం.. ఆ నాటి నెహ్రూ నుంచి ఈనాటి మోడీ వరకూ అందరు భారత ప్రధానులకు నిత్యం ఓ పెను సవాల్ గా మారిన నిత్య నూతన సమస్య. ఐతే... మోడీ సర్కారు ఈ సమస్యకు చరమ గీతం పాడబోతోందా.. మళ్లీ కాశ్మీర్ వైపు చూసే ధైర్యం చేయకుండా పాకిస్థాన్ కు గట్టిగా బుద్ది చెబుతుందా..?


ఔనంటున్నారు.. కేంద్రం హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. కాశ్మీర్ సమస్యకు మోదీ సర్కార్ శాశ్వత పరిష్కారం చూపిస్తుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. కాశ్మీర్ లో సమస్యను రాజేయడం ద్వారా భారత్ ను అస్థిర పరిచేందుకు పాక్ యత్నిస్తోందన్న రాజ్ నాథ... ఆ దేశం తన పద్ధతిలో మార్పు రాకపోతే, మనమే మార్చాల్సి వస్తుందని రాజ్ నాథ్ అన్నారు.



ఇదే సమయంలో మరో మంత్రి జితేంద్రసింగ్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలుచేశారు. పాకిస్థాన్ పై మరోసారి భారత్ సర్జికల్ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు సంకేతాలు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో ఇండియాటుడే ఎడిటర్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన ఈ దాడులపై నర్మగర్బమైన వ్యాఖ్యలు చేశారు.



భారత సైన్యం మరోసారి సర్జికల్ దాడులు నిర్వహించనుందా?’ అనే ప్రశ్నకు..  మేం మీకు ముందు చెప్పి ఏ పనీ చేయం కదా.. అన్నారు. పీఓకేలో కూడా  సర్జికల్ దాడులు పూర్తయిన తర్వాతే  ఆ విషయాన్ని మీడియాకు చెప్పామన్నారు. ఈ సారీ కూడా అంతే జరుగుతుందన్నారు. దాదాపు ఒకే సమయంలో ఇద్దరు కేంద్రమంత్రులు ఈ రకంగా స్పందించడం చూస్తే పాక్ పై భారత్ ఏదో గట్టి వ్యహమే పన్నుతున్నట్టు కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: