కేంద్రమంత్రి అనిల్‌ మాధవ్‌ దవే మృతి..!

Edari Rama Krishna
కేంద్ర పర్యావరణ, అటవీశాఖమంత్రి అనిల్‌ మాధవ్‌ దవే (61) గురువారం ఉదయం ఆకస్మికంగా కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అస్వస్థతో బాధపడుతున్నప్పటికీ..మృతికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియ రాలేదు.  అనిల్‌ మాధవ్‌ దవే మృతి వ్యక్తిగతంగా తనకు తీవ్ర నష్టమని, నిన్న సాయంత్రం వరకూ ఆయన తనతో కీలక విధానాలు చర్చించినట్లు నరేంద్ర మోదీ తెలిపారు.  2009 లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

1956 మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని బాద్ నగర్ లో ఆయన జన్మించాడు. ఇండోర్ లోని గుజరాతీ కళాశాలలో ఎంకామ్ పూర్తి చేసిన ఆయన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు.ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన దవే.. నర్మదా నది సంరక్షణ కోసం పోరాడారు. మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.  గతేడాది జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రధానమంత్రి మోదీ.. దవేకు పర్యావరణ, అటవీ శాఖ బాధ్యతలను అప్పజెప్పారు.

బుధవారం సాయంత్రం కూడా కొన్ని కీలక అంశాలపై తాము చర్చించినట్లు ట్విట్టర్ లో ప్రధాని వివరించారు. ఆయన మరణం తీవ్రంగా కలిచివేసిందని, ప్రజా ప్రతినిధిగా ఆయన నిర్వహించిన బాధ్యతలు అమోఘమని కొనియాడారు.   కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా దవే మృతి పట్ల సంతాపం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: