వృత్తి విద్యా కోర్సుల ఫీజుల విషయంలో ఆలస్యంగా నైనా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న కార్పోరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువు కొంటున్న విద్యార్థుల నుండి నిబంధనలు లేకుండా ఇష్టాను సారంగా ఫీజులను దండుకుంటుంటే ఇప్పటి వరకు ఈవిషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ను తీసుకు రాలేదు. అందరికన్న తామే విద్యార్థులను “చైతన్యం”చేస్తున్నామని చెప్పుకునే విద్యాసంస్థల ఫీజులను భరించలేక అప్పులపాలయి చివరకు “నారాయణు”డే దిక్కంటున్న తల్లిదండ్రుల బాధల గూర్చి అసలు ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. ఫలితంగా కార్పోరేట్ విధ్యాసంస్థలు ఆడిందే ఆటగా సాగుతుంది.
ఆడ్మిషన్ల సమయంలో ఇంటికి 10సార్లు తిరిగి విద్యార్థులను వారి కళాశాలలకు నమ్మించి, రప్పించి, ఇరికించి చివరకు చదువు మద్యలో అధిక ఫీజుల కోసం ఇబ్బందులకు గురిచేస్తూ విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నటువంటి కళాశాలలు సైతం ఉన్నాయి. ఇదంతా జరుగుతున్న ఇటువంటి ప్రైవేట్ కళాశాలపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. విద్యార్థుల సమస్యల గూర్చి పట్టించుకుంటున్నామని చెబుతున్న విద్యార్థీ యూనియన్లు ఫీజుల నియంత్రణ విషయంలో యాజమాన్యాలను ఎందుకు ప్రశ్నించడం లేదో అంతు పట్టడం లేదు. కొంత మంది నాయకుల బందువులకు, విద్యార్థీ నాయకులు సూచించిన వారికి తక్కువ ఫీజుకో లేదా కొంత మందికి ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వడం ఫలితంగా ఫీజుల విషయంలో ప్రశ్నించే వారు కరువయ్యారు. దీంతో కార్పోరేట్ విద్యాసంస్థల దోపిడికి అంతు లేకుండా పోతుంది.
హాస్టల్ వసతుల పేరిట ఒక్కో విద్యార్థి దగ్గర సంవత్సరానికి 50నుండి 60 వేల వరకు ఇతరత్రా ఫీజులు, ఖర్చులు మరో 20వేల వరకు దండుకోవడంతో పాటు ప్రత్యేక క్యాంపస్, బ్యాచ్ ల పేరిట సంవత్సరానికి లక్షరూపాయలకు పైగా వసూలు చేస్తున్నటువంటి కళాశాలలున్నాయి. ఇదంతా జరుగుతున్నప్పటికిని విద్యార్థులు మంచి మార్కులు సాదించడం లేదు. 75 శాతం విద్యార్థులు పై చదువుల కోసం నిర్వహించే అర్హత పరీక్షలకు మంచి ర్యాంకులు సాధించడం లేదు. దీంతో లక్షలు వెచ్చించి చదువుకున్న వారు సైతం ఉన్నత చదువులను సైతం డబ్బులు చెల్లించి చదువుకోవల్సి వస్తుంది. ఇప్పటి కైనా ప్రభుత్వం స్పందించి కార్పోరేట్ కళాశాలల ఫీజులను నియంత్రించాల్సిన అవసరముంది.
మరింత సమాచారం తెలుసుకోండి: