కాశ్మీర్ ముఖ్యమంత్రికి భారత ప్రదానికి మద్య చీకటి ఒప్పందమే ఆర్టికల్ 370


భారత రిపబ్లిక్ లోని అనేక రాష్ట్రాల్లో జమ్ము కాశ్మీర్ ఒకటి. కాని మరే రాష్ట్రానికి లేని దిక్కుమాలిన నడమంత్రపు ప్రత్యేకతలు దానికి చాలా ఉన్నాయి. మిగతా దేశ మంతటి కి శిరోధార్యమైన భారత రాజ్యాం గానికి అక్కడ చెల్లుబాటు తక్కువ. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తప్ప భారత కేంద్ర కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా చేసే ఏ చట్టమూ జమ్మూ కాశ్మీరుకు వర్తించదు. భారత  పౌరులందరికి ఒకే రాజ్యాంగం ఒకే పౌరసత్వం. ఒకటే జాతీయ పతాక (జాతీయ జెండా) మరే రాష్ట్రానికి లేని రీతిలో జమ్మూ కాశ్మీరుకు రెండు పౌరసత్వాలు, రెండు రాజ్యాంగాలు, రెండు జాతీయ జండాలు.


భారత యూనియన్ లో విలీనమైన "కాశ్మీర్ కింగ్-డం"  ఏడు దశాబ్ధల తరవాత కూడా జాతీయ జీవన స్రవంతిలో కలవకపోవటానికి కారణం ఈ విపరీత చట్టమే భారత రాజ్యాంగములోని 370వ అధికరణమే. 


అనేక తర్జన బర్జనల తరవాత పాకిస్థాన్ తో చావుదెబ్బ రుచి చూసిన తరవాత కాశ్మీర్ మహరాజు హరిసింగ్ భారత్ శరణిజొచ్చి అక్టోబర్ 26 తారీఖు 1947 అంటే సరిగ్గా భారత స్వాతంత్రం వచ్చాక రెండు నెలల పదకొండు రోజుల తరవాత కాశ్మీరును భారత యూనియన్ లో విలీనం చేసి రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లనే మూడు శాఖలు కేంద్ర ఆధిపత్యానికి ఒప్పగించి తదనుగుణ అంగీకార విలీన పత్రంపై తన హస్తాక్షరాలు లిఖించాడు. ఒక్క అక్షరం పొల్లుబోకుండా ఇండియన్ యూనియన్లలోని స్వతంత్ర సంస్థానాలన్నీ వారికి నచ్చినట్లు వారి వారి భౌగోళిక, ఆర్ధిక, మత, సామాజిక అవసరాల ఆధారంగా భారత్ లేదా పాకిస్థాన్లలో విలీనం అయ్యారు. ఈ అవకాశం "ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్"  పేరుతో బ్రిటిష్ పార్లమెంట్ సంస్థానాదీశులకు దఖలు పరచిన చట్టం ప్రకారం చేసిన వెసులుబాటు.



ఈ యాక్ట్ ప్రకారం కొంత ఊగిసలాట తరవాత కాశ్మీర్ మహరాజు చేసిన విలీన ప్రక్రియ సమంజసంగానే ఎవరూ ప్రశ్నించలేని రీతిలో ముగిసింది.


ఇక్కడే భారత్ లో బ్రిటీష్ చిట్టచివరి వైస్రాయ్ లార్డ్ మౌంటుబాటన్ అనబడే తెల్లోడి దుర్లక్షణం నమ్మకద్రొహం చేసి  భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహౄను తప్పు దోవపట్టించి కాశ్మీర్ ను "చల్లారని రావణ కాష్ఠం"  ఇండో-పాక్ ల మధ్య రగిల్చి అవసరమైనప్పుడు ఆజ్యాం పోస్తూ దాని ఎడతెగని సమస్య గా మార్చటానికి మన ప్రధాని అసమర్ధతే కాదు - నేటి రాష్ట్రపతి కంటే తక్కువ అధికారాలున్న మౌంట్-బాటన్ కు ఎంతవరకు గౌరవమివ్వాలో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వటం మూలాన్నే ఇది జరిగింది. 



In 1954, Jawahar Lal Nehru got angry and misbehaved during a Congress meet when someone disagreed with him.




మౌంట్-బాటన్ నెహౄను ఆవహించి చేసిన దుష్ఠకార్యం దరిమిలా ఫుల్-స్టాఫ్ పడాల్సిన చోట ప్రశ్నార్ధకం పడటాన్ని నాటి మైకంలో జవాహర్లాల్ గమనిచలేక పోయాడు. నిజంగా చెప్పాలంటే మౌంట్-బాటన్ నెహౄ మెదళ్ళో కూర్చొని (మౌంట్-బాటన్ బ్రైన్ తో నేహౄ పనిచేసినట్లుగా భావించవచ్చు)  చెతులు పనిచేసేలా చేసి - కాశ్మీర్ విలీనం జరిగాక దాని ప్రజాభిప్రాయంతో తరవాతెప్పుడో ఖరారవుతుందని మోసపూరిత మెలిక పెట్టటం ద్వారా ప్రతిసంవత్సరం 1947 నుండి నేటివరకూ భారత్ తన జాతీయ సంపదనంతా కాశ్మీర్ లోయలోనే లక్షల కోట్లలో ధార పోస్తుంది. అశాంతిని దొంతరులుగా పెరిగి పోతుంది. (సున్నితమైన అంశాలు మిళితమై ఉన్నందున దీనిపై ప్రత్యేక వ్యాసం ద్వారా కొద్దిరోజుల తరవాత వివరిస్తాను) 


జె & కె ప్రజలు దృవీకరించే లోగా పాలన ఎలాగన్న ప్రశ్న ఉదయించటం తద్వారా కేంద్రం నిర్ణయాలు జె & కె  రాష్ట్ర ప్రభుత్వానికి అమోదయోగ్యం అయితేనే ఆ రాష్ట్రానికి వర్తింపజేయాలని తాతకాలికంగా 370 వ అధికరణాన్ని రాజ్యాంగములో పొందుపరచారు. విలీన ఒప్పంద పత్రంపై కాశ్మీర్ మహారాజు సంతకం పెట్టిన నాటినుండి కాశ్మీర్ ప్రజలు విలీనాన్ని దృవీకరించేవరకు ఈ అధికరణం అమలులో ఉంటుంది. ఇది మహాభారతములో శకుని రూపొందించిన పాచికలాట ను మించిన కుతంత్రం. నాడు భగవానుడు ఉండి ఎంతో కొంత దానిని భవిష్యత్తులో ధర్మవర్తనులైన పాందవులకు ప్రయోజన పూరితంగా మలచ గలిగాడు.




కాని జవహర్లాల్ నెహౄకు అధికార దాహం తప్ప కార్యసాధనలో ఆ దాహం లేదని కాశ్మీర్ వివాదం ద్వారా ఋజువైంది. సర్దార్ పటేల్ నాయకత్వములో దేశములోని వందలాది స్వతంత్ర సంస్థానాలు హైదరాబాద్ లాంటి బలమైన రాజ్యాలతో సహా విలీనం ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోగా - నాజన్మ భూమి కాశ్మీర్ రాజ్య సంగతి నేనే చూస్తానన్న నెహౄ దేశం మొత్తానికి తన అసమర్ధత బలహీనతలతో తలకొరివి పెట్టేశాడు. అదే సర్దార్ ను నాడు కలగజేసుకోనిచ్చి ఉంటే భారత్ నేడు అమెరికాను సైతం అన్నిరంగాల్లో ఢీకొట్టగలిగి ఉండేది.


జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ నిర్ణాయక సభ తో రికమండేషన్ తో మాత్రమే 370 అధికరణము ఏత్తివేసే అవకాశం ఉంది. కాని మౌంట్ బాటన్ భారత్ చుట్టూ కాశ్మీర్ విషయములో కట్టిన కంచె రాజ్యాంగ నిర్ణాయక సభ విలీనానికి అమోదముద్ర వేయటం తో 1956 లో ప్రజా తీర్పు ద్వారా తొలగించ బడినది. అప్పటికి భారత్ లో జమ్ము కాశ్మీర్ విలీనం పూర్తైంది. అదీ భారత్ లో ఇతర రాష్ట్రాల తో సమానం కలిగి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా అన్నింటా ఇతర రాష్ట్రాలతో సమానం అని మనకు దృవీకరించబడింది.


ఆశించిన ప్రయోజనం నెరవేరగానే ఆ 370 అధికరణం తొలగించి ఉంటే కూడా భారత్ నేడీ దుస్థితి లో ఉండేదికాదు. అన్నీ రాష్ట్రాలకు మాదిరిగా భారత రాజ్యాంగం 19 (1) అధికరణం ప్రసాదించిన స్వెచ్చతో దేశములోని అన్నీ ప్రాంతాలవారు కాశ్మీర్ లో స్థిరపడి వ్యాపారాలు చేసి ఆస్తులు భూములు సంపాదించేవారు భారతీయ రాజ్యాంగం, శాసనాలు చెల్లుబాటై భారతీయ సజీవ జీవన స్రవంతి లో జమ్ము కాశ్మీర్ కలిసిపోయి భారత సంస్కృతిలో సంగమించి ఉండేది.


మదరాసీలు, తెలుగువారు, కన్నడిగులు, పంజాబీలు, మరాఠీలు మాత్రమేకాదు అనేక ప్రాంతాల భారతీయులకు కాశ్మీర్ నివాస మై ఉండేది. అక్కడ అన్నీ రంగాల్లో పోటీ ఏర్పడి అభివృద్దిపథములో మొదటి వరసలో ఉండి పర్యాటకం ద్వారా కూడా అంతులేని ఆర్ధిక వనరులను పొంది ఉండేది. సాధారణ ప్రజా జీవితమెంతో హృద్యమంగా ఉండేది.




జవహర్ లాల్ నెహౄకు షేక్ అబ్దుల్లా కుటుంబముతో ఉన్న వ్యక్తిగత సహవాసం, మొహమాటం, స్నేహం, దేశభద్రత పై అవగాహన లేమి - కొందరు స్వార్ధపరుల, పెత్తందార్ల స్వప్రయోజనాల కోసం దేశ అత్యంత రక్షణావశ్యకమైన కాశ్మీర్లోయని కష్టాల్లోకి నెట్టేసి దేశ భవితనే ఫణంగా పెట్టి ఈ దుస్థితికి కారణం చేశాడు మన ఆత్మీయ జవహర్ నాయకత్వం.  జవహర్ షేక్ అబ్దుల్లా తో ఉన్న మొహమాటం ఫలితంగా భారత రాజ్యాంగములోని 370 అధికరణం జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి శాశ్వతంగా ఏర్పాటుగా మారిపోవటంతో భారత జాతి దురదృష్టం.




భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 : అంటే ఏమిటి ?


ఆర్టికల్ 370  : భారత దేశ ప్రజలకు మన దేశ ప్రథమ ప్రధాని ఇచ్చిన చేదు మాత్ర.

అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా, భారత ప్రధాని నెహ్రూ మధ్యకుదిరిన చీకటి ఒప్పందమే ఈ ఆర్టికల్ 370.

ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటో తెలుసుకోవాలి

భారత దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ కు ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది. 

భారతదేశంలో అందరికీ ఒక పౌరసౌత్వం వుంటే, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా “రెండు పౌరసౌత్వాలు”  కల్పించబడ్డాయి.

ఈ ఆర్టికల్ తో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సెపరేట్ అజెండానే కాదు జెండా కూడా వుంది. 

దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే, ఇక్కడ ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 

ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ సార్వభౌమాదికారాన్ని,  జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదంట.

సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు. 

పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం

జమ్మూ కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది

అదే  పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది. 

ఆర్టికల్ 370 మూలంగా 

సమాచార హక్కు  చట్టాలు ఇక్కడ చట్టుబండలే అవి ఇక్కడ పనిచేయవు

విద్యహక్కు చట్టం కూడా ఇక్కడ పనిచేయదు.  ఇక్కడ అప్లై చేయబడదు

కాగ్ కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు. 

జమ్మూ కాశ్మీర్  మహిళలపై షరియా చట్టాలు అమలు చేయబడతాయి. 

అక్కడి పంచాయితీలకు ఎటువంటి అధికారాలు లేవు. 

కాశ్మీర్ లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్దులు) రాజ్యాంగబద్దంగా రావాలిసిన 16% రిజర్వేషన్లు అమలు కావాడం లేదు. 

ఆర్టికల్ 370 మూలంగా వేరే రాష్ట్రానికి చెందిన పౌరులు ఎటువంటి భూ క్రయ విక్రయాలు చేయ డానికి వీలు లేకుండా పోయింది.  

భారత పౌరసౌత్వం కోసం పాకిస్థానులు చాలా మంది ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకుంటు న్నారు. 

ఇప్పటికే చాలా ఘోరం జరిగిపోయింది.




ఈ చట్టం లోని ప్రధానాంశాలు చదివితే మీకేమర్ధమౌతుంది?

వీలున్నంతగా షేక్ అబ్దుల్లా లాంటి ఉన్నత వర్గ కుటుంబాలకు,

కాశ్మీరి యువతులను పెళ్ళాడే పాకిస్థాని యువకులకు ప్రయోజనం చేయటం

భారత్ లోని సంపద సారాన్ని దోచిపెట్టటం లక్ష్యంగా సాగిన ఈ అధికరణం నిర్మాణం చూస్తే భారత్ కు జవహర్లాల్ నెహౄ ఎంత అన్యాయం చేశాడో? భారత్ పై ఎంత దుర్మార్గం చేయ సాహసించాడో? అసలు ఆయన నిజంగా భారతీయుడేనా? కనీసం సధారణ హిందువేనా? అనే అనుమానాలు పొడచూపటం తథ్యం.

ఏ సందర్భంలో ఆయన ఈ ఆర్టికిల్ లేదా అధికరణం అమలుచేయ సంకల్పించారు?  ఆయనకు ఆ సమయములో మతిస్థిమితం లేదా? ఏ బలహీన క్షణం లో ఆయన్ను షేక్ అబ్దుల్లా కుటుంబం వశం చేసింది? ఏదైనా వశీకరణం జరిగిందా? అనే ప్రశ్నలు సాధారణ పౌరునికివచ్చే అనుమానాలు.

ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడానికి పావులు కదుపుతోంది. 





ఎవరైనా సరిహద్దు ప్రాంతాన్ని రక్షణ ప్రాతిపథికన ప్రత్యేక పరిపాలన యంత్రాంగం ముఖ్యంగా యూనియన్ టెర్రిటరి గా చేసి తన కనుసన్నలలో పాలన సాగించవలసిన చోట ఇంతగా షేక్ అబ్దుల్లా లాంటి పయోముఖ విష కుంబానికి లొంగిపోవటము లోని బలహీనత ఏమిటనేది ఇప్పటికీ భారత్ ప్రజలకు అర్ధంగాని సమస్య. డిల్లి అంగీకార పత్రం ద్వారా జె & కె కి ప్రత్యెక రాజ్యాంగాన్ని, ప్రత్యేక చిహ్నం, ప్రత్యేక ఝెండా, ప్రత్యేక వారసత్వం ఒనగూర్చటమే దేశ ద్రోహం కాదా! అంతేగాదు దీన్ని ఇప్పటికి రడు దశాబ్ధాల నుండి కొనసాగిస్తూ వస్తున్నారు. ఎందరు కశ్మీరీ యువతులు పాకిస్థాన్ యువకులను పెళ్ళాడా రో ఎందరు పాకిస్థానీయులు ఈ ఒడంబడిక మూలంగా భారత పౌరసత్వం పొందారో వీళ్ళలో ర్వడైనా ఎవడైనా రేపు కెంద్రములో ప్రథాని అవ్వచ్చు దేశ రక్షణ మంత్రి  అవ్వచ్చు. దేశ రక్షణ అప్పుడు ప్రమాదములో పడదా? ఇప్పటికైనా మనం మనలని పరిపాలించు కుంటున్నామా?


ఎవడో భారతీయుని రూపములో ఉన్న పాకిస్థానీ మనలని ఏదోఏకంగా వాడుకోవటం లేదు కదా? ఇవన్నీ సగటు భారతీయుని అనుమానాలు. మరి ప్రధాని నెహౄకి ఈ మాత్రం తెలియదా?



Did Jawaharlal Nehru govt snoop on Netaji's letter mentioning an 'illegitimate child'?



సరే ఈ చట్టం కనీసం కాశ్మీరు ప్రజలకైనా మేలు చేసిందా?  అంటే


పార్లమెంట్ చేసే ఏ చట్టమైనా ఆరాష్ట్రం లో అమలుచేయటం ఆ రాష్ట్ర ప్రభుత్వ అంగీకారానికి వదలివేయటం 370అధికరణం ప్రసాధించిన వరం. అందుకే ఏ ఆత్రం నమ్మతగని షేక్ అబ్దుల్లా ఈ చట్టం ద్వారా ఆ రాష్ట్రానికి మకుటం లేని రారాజు ను చేశారు నెహౄ. అందుకే స్వార్షం నరనరాన జీర్ణించుకున్న కశ్మీర్ సింహం ప్రజలను తొక్కిపట్టి ఏ ప్రయోజనాలను వారికి అందనివ్వకుండా సాధారణ కాశ్మీరీని బికారిని చేస్తూవచ్చి తాను తన కుటుంబం బాగా బలిసిపోయేలా చేసుకున్నారు.


*పట్టణ భూ గరిష్ఠ పరిమితి కాశ్మీర్ లో అమలు కాలేదు. భూస్వాములు, కబ్జా కోర్లు రాజకీయ పలుకుబడి కలిగిన మోతుబరి భూస్వాములు విలువైన కాశ్మీరి భూములను స్వంతం చేసుకున్నారు. ఇండియాలో పట్టణ గరిష్ఠ భూపరిమితి చట్టం అమలుకో ఉంటేనే మన రాజకీయ కబ్జాకోర్లు భూమిని బినామీల రూపములో దోచేసుకునే పరిస్థితులను చూస్తున్నాం. అలాంటిది అసలు చట్టం అమలుగాని కాశ్మీర్లో ప్రజలకు దిక్కూ దివాణం ఉండదు.



Dr. Ambedkar denied drafting a separate constitution for J&K. 


ఇంకో ప్రమాదకర విషయమేమంటే దేశమంతా అమలులో ఉన్న పార్టీ ఫిరాయింపు నిరొధక చట్టం ద్వారా ఏ శాసన సభ్యుడైనా అర్హత కోల్పోయిందీ లేనిదీ శాసనసభ సభాపతి లేదా స్పీకర్. కాని కాశ్మీర్లో మాత్రం ఆ అధికారం లెజిస్లేచర్ పార్టీ నాయకుడే. అతని ఇస్టమైతే మొత్తం శాశన సభ్యులను ఏకం గా  శాసనసభనే రద్ధుచేయగలడు. ఎన్నికలకు టిక్కెట్ ఇచ్చేదీ, పార్టీగెలిస్తే అధికారం అందుకునేది, ఇష్టం లేకపోతే శాసన సభ్యత్వాన్ని రద్దుచేసేది ఒక్కడే అయినప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టేది ఎలా? ప్రజలకు మేలు కలిగేదెలా?


ప్రార్ధనా స్థలాలను ఉగ్రవాదులు దుర్వినియోగం చేసే సందర్భాన్ని అడ్డుకోవటానికి ఖలిస్థాని తీవ్రవాదులను నిలువరించ టానికి భారత ప్రభుత్వం చేసిన చట్టం మిగతా రాష్ట్రాలకంటే కాశ్మీర్కే ఎక్కువ అవసరం కాని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయక పోవటంతో ఒక కాశ్మీర్ మాత్రమే ఉగ్రవాదులతో అట్టుడికి పోతుంది ఈనాటికి దీనికి కారణం 370 అధికరణమే.





కాశ్మీర్ పౌరునికి దేశమంతా భారత పౌరసత్వం అడక్కుండానే జన్మతః లభిస్తుంది. అతను భారత్ లో ఎక్కడైనా స్థిరపడొచ్చు. భుములు కొనుక్కోవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. ఓటువేసుకోవచ్చు. ప్రజాస్వామ్యములో తన కేకు తాను తినొచ్చు.


కాని ధౌర్భగ్యపు చట్టం దరిమిలా కాశ్మీర్ లో జన్మతః వచ్చే పౌరసత్వం తప్ప వేరే రాష్ట్రం వాణ్ణి దాదాపుగా విదేశీయునిలా చూస్తారు. అతనక్కడ ఓటు వేయలేడు. వ్యాపారం చేయలేడు. భూములు సంపదలు ఒనగూర్చు కోలేడు. చివరకు ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అర్హుడు కాలేడు. చివరకు భారత్ లోనే ఉన్న భరతీయుణ్ణా అనేది ప్రశ్నార్ధకమే. ఇంత ఏకపక్ష ధౌర్భాగ్య అంగీకార ఒడంబడిక పై జవహర్లాల్ నెహౄ తప్ప వేరెవరైనా సంతకం చేయగలరా? అందుకే షేక్ అబ్దుల్లా కాశ్మీర్ సింహం అయ్యారు. భారత్ ను భారత్ నాయకత్వాన్ని జోకర్ గా చూశారు. అదే ఒక పాకిస్తానీ కాశ్మీరి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే వాడు భారత్ కే అల్లుడైపోయే చట్టం పై ది గ్రేట్ జవహర్లాల్ భారత్ కు ఇచ్చిన బహుమతి. పాకిస్థాన్ నుండి ప్రాణరక్షణ కోసం ఇండియాకు వచ్చిన హిందువుకైతే  పౌరసత్వం ఇవ్వరుగాని - పాకిస్థాన్ నుండి బాగుపడదామని కాశ్మీర్ కు వచ్చిన ముస్లిములకు ఇక్కడ పౌరసత్వం తో పాటు రిసెటిల్మెంట్ సదుపాయాలు కలిపించే ఘనత కాశ్మీర్ ప్రభుత్వానికి ఉంది. ముస్లిములకు రెడ్-కార్పెట్ పరిచి అహ్వానించే ఆ రాష్ట్రములో నివసించే హిందువులకు 70 సంవత్సరాలకు కూడ పౌరసత్వం ఇవ్వని దుర్మార్గం కాశ్మీర్ ప్రభుత్వానిది.


భారతీయులు ఇక్కడ స్థిరపడరు. పాకిస్తాన్ వాళ్ల కు ఇది స్వర్ఘధామం. అందుకే జనాభా నిష్పత్తిలో సమన్వయం లేక కాశ్మీర్ వాళ్ళకు ఇండియా అంటే గౌరవం లేదు ప్రేమ లేదు. చివరకు మన దగాకోరు రాజకీయ నాయకుల వల్ల కాశ్మీర్ మానసికంగా మనదికాకుండా పోయింది.    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: