పందిని వేటాడి తినుమంటున్న కలెక్టర్..బ్రాహ్మణుల ఆగ్రహం...!!

Shyam Rao

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. క్షయ వ్యాధి నివారణ దినం కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ, మానవహారం కార్యక్రమంలో కలెక్టర్‌ మురళి మీడియా తో మాట్లాడుతూ.. రోగనిరోధక శక్తి పెరిగి ,ఆరోగ్యంగా ఉండాలంటే అడవి పంది మాంసం తినాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలు పెద్ద మాంసం తినేవాళ్లు.. మధ్యలో దరిద్రపు బ్రాహ్మణ కల్చర్‌ వచ్చి పెద్ద మాంసం బంద్ చేయించిందంటూ నోరు జారారు.



కాగా, తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశారు. అడవి పందులను పట్టుకోవచ్చని… వాటిని తినవచ్చని అటవీ శాఖ ప్రకటించిందని.. వాటిని చంపినా నేరం కాదని, ఎలాంటి కేసులు ఉండవన్నారు. నెమలి, దుప్పి వంటి వన్యప్రాణులను చంపవద్దని, వాటి మాంసం తినవద్దని కలెక్టర్ సూచించారు.   బ్రహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడడంతో ఆగ్రహానికి గురైన బ్రాహ్మణ సంఘం నేతలు ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ రోజు డీజీపీని కలవనున్నారు.



మాంసాహారం అవసరాన్ని ఇంత పవర్‌పుల్‌గా ప్రకటించిన కలెక్టర్ చివరలో బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పారు. పేద ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్న సందర్భంగా దీక్షలు మానుకోవాలని, బ్రాహ్మణిజం అనే పదాన్ని ఉచ్చరించానని, ఈ విషయంలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిని ఉంటే చింతిస్తున్నానని, ఆ పదం వాడినందుకు క్షమించాలి అని కలెక్టర్ తెలిపారు. అయితే టీబీ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని.. పంది, గొడ్డు మాంసం తినాలని సూచించడంలో తానే తప్పూ చేయలేదని, అడవి జంతువుల మాంసాహారం సామాన్య ప్రజలకు చాలా అవసరమని కలెక్టర్ మురళి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: