షాకింగ్..నిమిషంలో 124 కొబ్బరికాయలు...!!

Shyam Rao

సహజంగా మనం ఒక కొబ్బరికాయ ని చేతిలో పట్టుకొని కొట్టడానికి కనీసం ఒక్క నిమిషం సమయాన్ని అయినా తీసుకుంటాం. అదీ కొన్ని కొబ్బరికాయలు కొట్టడానికి చాలా సమయం పడుతుంది కదా.. అలాంటిది కొబ్బరికాయని చేత్తో పగలగొట్టమని అడిగితే ఒకేసారి కళ్ళు తేరేస్తారు. అలాంటిది ఒక వ్యక్తి ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి 124 కొబ్బరికాయలను ఒకే నిమిషంలో పగలగొట్టాడు అంటే నమ్ముతారా...? అవునండి ఇది పచ్చి నిజం.. వివరాల్లోకి వెళితే..



కేరళకు చెందిన పి.డొమనిక్‌ మాత్రం వట్టి చేతుల్తో ఏకంగా 124 కొబ్బరికాయలను కేవలం ఒకే ఒక్క నిమిషంలో పగలగొట్టి ఔరా! అనిపించాడు. ఇక్కడి త్రిశూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రోడ్డు రవాణా సంస్థలో మెకానిక్‌గా పనిచేస్తున్న డొమనిక్‌ అంతకుముందు జర్మనీ వ్యక్తి పేరిట ఉన్న (118 కొబ్బరి కాయలు) రికార్డును బద్దలుకొట్టాడు.



త్వరలో గిన్నీస్‌బుక్‌ అతడి రికార్డును గుర్తించనుంది. వాస్తవానికి అతడు నిమిషంలో 145 కొబ్బరికాయలు పగలగొట్టినప్పటికీ అందులో 124 మాత్రమే పూర్తిగా పగలడంతో వాటినే లెక్కలోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: