భారత్ లో శివుని అతి పెద్ద విగ్రహం..!

Edari Rama Krishna
భారత దేశంలో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి మహాశివరాత్రి.  భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.  శుక్రవారం శివరాత్రి సందర్భంగా కోయంబత్తూర్ లోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి(శివుడు) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబడుతుంది.

ఈ సందర్భంగా ఈ విగ్రహం గురించి సద్గురు వాసుదేవ్ తెలిపారు. భూమ్మీద ఉన్న విగ్రహాలన్నింటిలోను అతి పెద్ద ముఖం ఉన్న విగ్రహం ఇదే అన్నారు. ఈ విగ్రహాన్ని పూర్తిగా  స్టీల్ తో తయారు చేశారని, సుమారు 500 టన్నులు ఉంటుందని అన్నారు.   మనిషి తన పరిధులను అధిగమించి పరమోన్నత స్థితికి చేరుకునేందుకు మహాశివుడు 112 మార్గాలను సూచించాడు.

శాస్త్రాల ప్రకారం.. మానవ శరీరంలో 112 చక్రాలు ఉంటాయి. భూమ్మీద నాలుగు దిక్కులా ఈ ఆదియోగి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈషా ఫౌండేషన్ సంకల్పించింది. అంతే కాదు భవిష్యత్ లో తూర్పున వారణాసిలో, ఉత్తరాల ఢిల్లీలో, పశ్చిమాన ముంబైలో ఆదియోగి విగ్రహాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు సద్గురు జగ్గీవాసుదేవ్ వెల్లడించారు. 

ట్విట్ :


On Mahashivratri, will be in Coimbatore to join the programme organised by @ishafoundation at the Isha Yoga Center. @SadhguruJV #Adiyogi pic.twitter.com/SZnaHbrlij

— Narendra Modi (@narendramodi) February 21, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: