డ్రైవింగ్ విషయం లో మైనర్లను జువైనల్ హోంకు, వాహన యజమాన్ని సాధారణ జైలుకు


మైనర్ల డ్రైవింగ్‌పై హైదరాబాద్ పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఒక్కసారి పట్టుబడితే జరిమానాతో వది లేసే కాలానికి స్వస్తి చెప్పనున్నారు. మొదటి సారికే జైలుకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూ మొదటి సారి  పట్టుబడిన మైనర్, అతనికి వాహనాన్నిచ్చిన యజమానిని జైలుకు పంపించేలా నగర ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసు కోనున్నారు. ఇందులో భాగంగానే మొదటిసారి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్లకు శిక్షలువిధించేలా చర్యలు తీసు కోవాలం టూ న్యాయ స్థానాన్ని కూడా కోరారు.




2016లో మైనర్ డ్రైవింగ్ కేసులు 4000 నమోదయ్యాయి, కొందరు మైనర్లు రోడ్డు ప్రమాదాలు చేయడం, స్పీడ్ డ్రైవింగ్‌లతో ఇతర ప్రయాణికులను ఆందోళనలు కల్గించిన ఘటనలు చాలా జరిగాయి. మైనర్లు, వారి తల్లిదండ్రులలో మార్పు రావాలంటే డ్రైవింగ్ విషయంలో కఠినంగా వ్యవహారించేందుకు అవసరమైన చర్యలు తీసుకొని, త్వరలో దీనిని అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.




హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు ఉల్లంఘనలకు పాల్పడే వారికి సంబంధించిన డాటాబేస్‌ను తయారు చేస్తున్నారు. దీనికి ఆధార్ నెంబర్‌నే ఆధారంగా తీసుకుంటు న్నారు. డ్రైవింగ్‌లో పట్టుబడ్డ మైనర్, అతనికి వాహనం ఇచ్చిన వారి ఆధార్ నెంబర్‌ తో కేసు నమోదు చేస్తారు. భవిష్యత్తు లో అన్ని విషయాలలో ఆధార్ నెంబరే ప్రధానం   కానుంది. ఒక్కసారి పట్టుబడి జైలుకు వెళ్లినా, కేసు నమోదయినా, అదిరికార్డులో ఉండిపోతుంది. ఇది భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశాలలో చదువులకు ఇబ్బందు లు కల్గించే అవకాశాలుంటాయి.


Our family is shattered because someone else was drunk and reckless. But no one in the government has reacted,'' said Ramya's cousin Vivek.



పిల్లలను ఉన్నత చదువులు చదివించి, వారు జీవితంలో మంచిస్థాయిలో స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. 18 యేళ్ళ  లోపు పిల్లలకు వాహనం ఇచ్చా రంటే అది తల్లిదండ్రుల తప్పుకూడా అవుతుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడుపొద్దంటూ తల్లిదండ్రులు పిల్లలకు సూచించాల్సిన అవసరముంటుంది. లైసెన్స్ లేకుండా, మైనర్ వయస్సులో వాహనం నడుపడం వల్ల కలిగే అనర్ధాలపై పిల్లలకు వివరించాలి. స్కూల్, కాలేజీల వద్ద వాహనాలు నడుపొద్దని చెప్పాల్సిన బాధ్యత తల్లి దండ్రులపై ఉంది. సరదా కంటూ వాహనం నడిపి, పోలీసులకు పట్టుబడితే బంగారు భవిష్యత్తుకు ఆటంకాలు కలిగే అవకాశాలుంటాయి. మైనర్ల ను జువైనల్ హోంకు, వాహన యజమాన్ని సాధారణ జైలుకు పంపించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: