హైదరాబాద్: రాష్ర్ట కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ తన మందిమార్భలంతో నగరంలోని ఓ దేవాలయం వద్ద శివాలెత్తాడు. నానా హంగామ చేశాడు. అంతటితో ఆగకుండా అక్కడ విధులను నిర్వహిస్తున్న ఓ ఎస్సైని తీవ్ర పరుష పదజాలంతో దూషించాడు. దీనితో మంత్రితో పాటు, ఆయన అనుచరులపై నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇస్కాన్ దేవాలయ స్థల వివాదానికి సంబంధించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలో 143, 353, 504, 506, 342, 424 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే...బంజారాహిల్స్ రోడ్ నెం 2లో లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను ఇస్కాన్ ఆలయానికి లీజుకు ఇవ్వడంపై వివాదాస్పదమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి మంత్రికి, ఆలయ ప్రతినిధుల మధ్య గత కొన్ని రోజులుగా పంచాయితీ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ భూముల లీజుకు సంబంధించి స్థానికుకుల ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకునేన మంత్రి నాగేందర్ తన అనుచరగణాన్ని వేసుకుని ఆందోళన వద్దకు చేరుకుని వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. ఇస్కాన్‌కు ఇచ్చిన లీజును రద్దు చేయాలంటూ స్థానికులతో గొంతు కలిపారు. దీనితో అక్క ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అక్కడ విధులను నిర్వర్తిస్తున్న ఎస్ఐ రమేష్‌కు, మంత్రి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. దీనితో రెచ్చిపోయిన దానం ఎస్సైని దూషించాడు. ప్రజల కోసం తానేమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. విధుల్లో ఉన్న ఎస్సైని దూషించినందుకు మంత్రి దానంతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, ఇదిలా ఉంటే మంత్రి దానం వాదన మరో విధంగా వుంది. ఇస్కాన్ ఆలయానికి వచ్చే యువతుల పట్ల ఆలయ ప్రతినిధులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనీ, ఇదే విషయమై ఓ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందంటున్నారు. దీనిపై తాను, మరికొంత మంది స్థానికులం కలిసి ఇక్కడ ధర్నా చేసేందుకు వచ్చామంటున్నారు. ఈ ఆలయంలో ఇలాంటివి జరిగితే తాను సహించబోనంటున్నారు. ఇస్కాన్ ప్రతినిధి ఒకరు ఓ యువతిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న విషయాన్ని దానం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇస్కాన్ ప్రతినిధులు మాత్రం మంత్రి దానం గత కొద్ది రోజులుగా తమల్ని కావాలనే వేధిస్తున్నారనీ ఇస్కాన్ ప్రతినిధులంటున్నారు. అయితే, ఇందులో ఏది నిజమో పోలీసుల విచారణలోనే తేలాల్సి వుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: